Breaking News

ఎయిర్‌లైన్స్‌కు పండుగే!

Published on Tue, 08/20/2024 - 06:25

న్యూఢిల్లీ: రానున్న పండుగల సందర్భంగా విమాన ప్రయాణాల బుకింగ్‌లకు ఇప్పటి నుంచే డిమాండ్‌ ఊపందుకుంది. దీంతో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు పలు మార్గాల్లో 10 శాతం నుంచి 25 శాతం మధ్య టికెట్‌ ధరలను పెంచేశాయి. దీపావళి సమయంలో ప్రయాణ టికెట్ల ధరలు 10–15 శాతం పెరగ్గా.. ఓనమ్‌ సమయంలో (సెపె్టంబర్‌ 6–15 మధ్య) కేరళలోని పలు పట్టణాలకు వెళ్లే విమాన సరీ్వసుల్లో టికెట్‌ ధరలు గతేడాదితో పోల్చి చూస్తే 20–25 శాతం మేర పెరిగినట్టు ట్రావెల్‌ పోర్టల్‌ ఇక్సిగో డేటా తెలియజేస్తోంది. దీపావళి సమయంలో ప్రయాణాలకు డిమాండ్‌ పెరుగుతోందని, దీంతో విమానయాన టికెట్ల ధరలు గతేడాదితో పోలిస్తే అధికమైనట్టు ఇక్సిగో గ్రూప్‌ సహ సీఈవో రజనీష్‌ కుమార్‌ తెలిపారు. 

→ అక్టోబర్‌ 30–నవంబర్‌ 5 మధ్య ఢిల్లీ–చెన్నై మార్గంలో ఒకవైపు ప్రయాణానికి ఎకానమీ తరగతి నాన్‌ స్టాప్‌ ఫ్లయిట్‌ టికెట్‌ ధర రూ.7,618గా ఉంది. క్రితం ఏడాది నవంబర్‌ 10–16తో పోల్చి చూస్తే 25 శాతం ఎక్కువ.  
→ ఇదే కాలంలో ముంబై–హైదరాబాద్‌ మార్గంలో ఫ్లయిట్‌ టికెట్‌ ధరలు 21 శాతం పెరిగి రూ.5,162కు చేరాయి.  
→ ఢిల్లీ–గోవా సరీ్వసుల్లో టికెట్‌ ధరలు 19 శాతం పెరిగి రూ.5,999కు, ఢిల్లీ–అహ్మదాబాద్‌ మార్గంలో ఇంతే మేర పెరిగి రూ.4,980గా ఉన్నాయి.  
→ హైదరాబాద్‌–తిరువనంతపురం మార్గంలో టికెట్‌ ధరలు 30 శాతం ఎగసి రూ.4,102కు చేరాయి.  
→ కానీ, పండుగల సీజన్‌లోనే కొన్ని మార్గాల్లో టికెట్‌ చార్జీలు 1–27 శాతం మధ్య తగ్గడం గమనార్హం. ఉదాహరణకు బెంగళూరు–హైదరాబాద్‌ మార్గాల్లో టికెట్‌ ధరలు 23 శాతం తగ్గి రూ.3,383గా ఉంటే, ముంబై–జమ్మూ ఫ్లయిట్‌లలో 21 శాతం తక్కువగా రూ.7,826కే లభిస్తున్నాయి. 
→ ముంబై–అహ్మదాబాద్‌ విమాన సరీ్వసుల్లో 27 శాతం తక్కువకే రూ.2,508 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముంబై–ఉదయ్‌పూర్‌ మధ్య టికెట్‌ ధర 25 శాతం తగ్గి రూ.4,890గా ఉంది.

విమాన ప్రయాణికుల జోరు 
దేశీయంగా జూలైలో 1.29 కోట్ల మందికిపైగా విమాన ప్రయాణాలు సాగించారు. 2023 జూలైతో పోలిస్తే ఇది 7.3 శాతం అధికం. అయితే 2024 జూన్‌తో పోలిస్తే గత నెల ప్రయాణికుల సంఖ్య 2.27 శాతం తక్కువగా ఉంది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రకారం.. దేశీయ విమాన ప్రయాణికుల విషయంలో ఇండిగో తన హవాను కొనసాగిస్తూ మార్కెట్‌ వాటాను జూలైలో 62 శాతానికి పెంచుకుంది. ఎయిర్‌ ఇండియా వాటా 14.3 శాతానికి వచ్చి చేరింది. విస్తారా వాటా 10 శాతానికి, ఆకాశ ఎయిర్‌ వాటా 4.7 శాతానికి పెరిగాయి.
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)