Breaking News

ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!

Published on Fri, 05/17/2024 - 12:44

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ టగ్‌ట్రక్‌ ట్యాక్సీను ఢీకొన్న సంఘటన బుధవారం పుణె ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు చెప్పాయి.

గ్రౌండ్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన విమానం టగ్‌ట్రక్‌ ట్యాక్సీను ఢీకొట్టింది. విమానం ముందు భాగంతోపాటు ట్రక్‌ దిబ్బతింది. ఫ్లైట్‌ కిందిభాగం ట్రక్‌కు తగలడంతో ల్యాండింగ్‌ గేర్‌ వద్ద టైర్‌ పాడయ్యింది. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు చెప్పాయి. భూమిపై విమానాన్ని నడిపేందుకు టగ్ ట్రక్ టాక్సీని ఉపయోగిస్తారు.

ఇదీ చదవండి: ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక

ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులను ప్రమాదం జరిగిన విమానంలో నుంచి దింపేసి వారి గమ్యస్థానాలు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు చెప్పాయి.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)