వెండి తెరపై విదేశీ అందాలు.. ఎయిర్‌లైన్‌ వినూత్న ప్రచారం

Published on Wed, 07/10/2024 - 14:56

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు సినిమా థియేటర్లలో ‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎయిరేషియా ప్రకటించింది. భారత్‌లోని 16 నగరాల నుంచి మలేషియా, థాయ్‌ల్యాండ్‌ల మీదుగా 130 గమ్యస్థానాలకు ఎయిరేషియా విమానాలు నడుపుతోంది. తన నెట్‌వర్క్‌లోని పర్యాటక స్థలాలను వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తామని కంపెనీ తెలిపింది. దానివల్ల భారత్‌లో తమ ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ పాల్‌ కరోల్‌ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సినిమా థియేటర్లలో ‘‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’’ ద్వారా కంపెనీ నెట్‌వర్క్‌లోని పర్యాటక స్థలాలను ప్రదర్శిస్తాం. దానివల్ల భారత్‌లో కంపెనీకి ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం క్యూబ్‌ సినిమాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. వచ్చే ఆరు నెలల్లో దేశంలోని 12 ప్రధాన నగరాల్లో 130 థియేటర్ల ద్వారా ఎయిరేషియా గమ్యస్థానాల గురించి వివరిస్తాం. భారతీయులు ఎక్కువ ప్రయాణించే ఆసియా, ఆస్ట్రేలియాల్లో పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది’ అన్నారు.

ఇదీ చదవండి: ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్‌

ప్రస్తుతం ఎయిరేషియా భారత్‌ నుంచి మలేషియా, థాయ్‌లాండ్‌లకు 22 డైరెక్ట్‌ సర్వీసులను నడుపుతోంది. త్వరలో మరో నాలుగు మార్గాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం గౌహతి, కోజికోడ్, లఖ్‌నవూ, కౌలాలంపూర్‌లను ఎంచుకుంది. రాబోయే కొన్ని వారాల్లో తిరుచిరాపల్లి నుంచి నేరుగా బ్యాంకాక్‌కు విమాన సర్వీసు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది.

#

Tags : 1

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)