Breaking News

గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు..

Published on Tue, 04/23/2024 - 09:13

వేసవికాలం కావడంతో దేశంలోని చాలామంది సమ్మర్‌ సెలవులు, ఇతర విహారయాత్రలు చేస్తూంటారు. ఈ తరుణంలో ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దాంతో దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది ప్యాసింజర్లు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య నడిచిన 6,128 విమాన సర్వీసుల్లో ఏకంగా 4,71,751 మంది ప్రయాణించినట్టు తేలింది.

ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజాగా వివరాలు వెల్లడించింది. కరోనాకంటే ముందు విమాన ప్రయాణీకుల సగటు (3,98,579)తో పోల్చితే ఇది 14 శాతం అధికం. గతేడాది ఏప్రిల్‌ 21న 5,899 విమాన సర్వీసుల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశీయ విమానయాన సంస్థల సర్వీసుల్లో ప్రయాణించినవారు 3.91కోట్లుగా ఉన్నట్టు గత వారం భారతీయ విమానయాన నియంత్రిత సంస్థ డీజీసీఏ తెలిపింది. గత ఏడాది ఇదే వ్యవధిలో ప్యాసింజర్లు 3.75కోట్లుగా ఉన్నారు. దీంతో వార్షిక వృద్ధి 4.38 శాతంగా నమోదైందని తెలిపింది. 

ఇదీ చదవండి: టాప్‌ 3 కంపెనీల్లో 64 వేలమందికి లేఆఫ్స్‌..!

‘ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, అందుబాటు ధరల్లో విమాన సేవలందించే సంస్థలు విస్తరిస్తున్నాయి. రోజురోజుకూ సరికొత్త స్థాయికి ప్యాసింజర్ల సంఖ్య చేరుతుంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగనుంది’ అని విమానయాన మంత్రిత్వ శాఖ తన అధికారిక ‘ఎక్స్‌’(ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేసింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)