Breaking News

ఏటా 40 కోట్ల మంది విమాన ప్రయాణం

Published on Tue, 01/07/2025 - 06:31

న్యూఢిల్లీ: ప్రాంతీయ విమానయాన కనెక్టివిటీ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశంగా కొనసాగుతుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి వుమ్లున్మాంగ్‌ వుల్నామ్‌ తెలిపారు. సీప్లేన్‌ల కార్యకలాపాల కోసం తగిన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘దేశంలో విమానయాన రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం దేశీయంగా 11 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 

ఈ సంఖ్య రెట్టింపై 22 కోట్లకు చేరుకుంది. 2029 నాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 40 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణం పట్ల ప్రజల్లో ఆకాంక్ష ఉంది’ అని వివరించారు. సేవలు అందించని, లేదా తక్కువ సేవలందించే ఎయిర్‌పోర్టుల నుండి ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడంతోపాటు విమాన ప్రయాణ వ్యయానిన మరింత  తగ్గించడం ప్రాంతీయ ఎయిర్‌ కనెక్టివిటీ (ఆర్‌సీఎస్‌) పథకం లేదా ఉడాన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

1.46 కోట్ల మంది.. 
హెలికాప్టర్లు, సీప్లేన్‌ల కార్యకలాపాలను పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని  వుమ్లున్మాంగ్‌ వివరించారు. 2016 అక్టోబర్‌లో ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం ప్రారంభమైంది. దీని కింద 2024 నవంబర్‌ 30 నాటికి 13 హెలిపోర్ట్‌లు, 2 వాటర్‌ ఏరోడ్రోమ్‌లుసహా సేవలు అందించని, తక్కువ సరీ్వస్‌లు ఉన్న 87 విమానాశ్రయాలను కలుపుతూ 613 మార్గాలు అందుబాటులోనికి వచ్చాయి. రీజినల్‌ కనెక్టివిటీ స్కీమ్‌ కింద ఇప్పటివరకు 2.86 లక్షల సర్వీసుల ద్వారా 1.46 కోట్ల మంది దేశీయంగా వివిధ నగరాలకు రాకపోకలు సాగించారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2024 డిసెంబర్‌లో పార్లమెంటుకు తెలిపింది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)