Breaking News

స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో పెరుగుతున్న బుకింగ్‌లు

Published on Sat, 08/03/2024 - 12:17

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 15న జరగబోయే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో తన ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు స్వాత్రంత్ర్య దినోత్సవం జరిగే వారంలో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నారని తెలిపింది.

సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు పెరుగుతున్నాయి. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. గోవా, జైపూర్, దుబాయ్ వంటి గమ్యస్థానాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రధాన మెట్రో నగరాలతో పాటు టైర్ 2, 3 పట్టణాల్లో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. సంస్థ ప్రకటించిన ‘ఎక్స్‌ప్రెస్ లైట్ జీరో-బ్యాగేజీ ఛార్జీ’లకు ఆదరణ ఎక్కువవుతుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు దేశీయంగా, దుబాయ్, సింగపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు భారీగా టెకెట్లు బుక్‌ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు 15న ఉన్న బుకింగ్‌లు పెరిగాయి.

ఇదీ చదవండి: బీఎన్‌ఎన్‌ఎల్‌ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదల

పంద్రాగస్టు ఉన్న మూడోవారంలో ప్రధానంగా గోవా, జైపూర్, బాగ్‌డోగ్రా, శ్రీనగర్, కొచ్చి, అయోధ్య, వారణాసి వంటి దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణాలు పెరుగనున్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. సంస్థకు అధిక రెవెన్యూ గల మార్గాల్లో కోల్‌కతా-కొచ్చి, బెంగళూరు-జైపూర్, హైదరాబాద్-వారణాసి, బెంగళూరు-బాగ్డోగ్రా, లఖ్‌నవూ-దుబాయ్, తిరుచిరాపల్లి-సింగపూర్, ఢిల్లీ-అయోధ్య ఉన్నాయని చెప్పారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)