Breaking News

ఐఫోన్‌ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్‌ పాత మోడళ్లు ఇవే..

Published on Sun, 04/16/2023 - 11:26

కొత్త సిరీస్‌ను ప్రారంభించినప్పుడు యాపిల్ పాత ఐఫోన్‌ మోడళ్లలో కొన్నింటిని నిలిపివేస్తూ వస్తోంది.యాపిల్‌ ఐఫోన్‌15 (iPhone 15)ఈ సంవత్సరం ఆఖరులో లాంచ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా కొన్ని పాత మోడళ్లను యాపిల్‌ నిలిపివేసే అవకాశం ఉంది.  

టామ్స్ గైడ్ నివేదిక ప్రకారం.. ఐఫోన్‌ 15 సిరీస్‌ని ప్రారంభించిన తర్వాత  ఐఫోన్‌14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్‌14 ప్రో మ్యాక్స్‌ (iPhone 14 Pro Max), ఐఫోన్‌13 మిని (iPhone 13 mini)తో పాటు ఐఫోన్‌12 (iPhone 12) మోడళ్లను యాపిల్‌ కంపెనీ నిలిపివేయనుంది. ఇందులో ఐఫోన్ 12ను నిలిపివేయడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఏ మోడల్‌ ఫోన్‌నైనా మూడేళ్లకు మించి అందుబాటులో ఉంచదు. ఐఫోన్‌12 మోడల్‌ నిలిచిపోతే దాని స్థానాన్ని ఐఫోన్‌ 13 భర్తీ చేస్తుంది.

యాపిల్ సాధారణంగా ఒక సంవత్సరం అమ్మకాల తర్వాత దాని ప్రో మోడల్‌లను ఆపేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. కానీ ఐఫోన్ 14 మాత్రం కొనసాగే అవకాశం ఉంది. దీని ధరను కూడా తగ్గించవచ్చు. రెండేళ్ల అమ్మకాల తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీని నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ 13 మినీని కూడా నిలిపివేయవచ్చని నివేదిక సూచిస్తోంది. 

ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌ను కొనసాగిస్తుందా.. నిలిపేస్తుందా అన్నది చెప్పడం కష్టం. దీని ధరను రూ.8000లకుపైగా తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్‌ 15 విడులయ్యాక దానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా కంపెనీ నిలిపేసే అవకాశం ఉంది. కాగా ఐఫోన్‌ (iPhone 15) సిరీస్ కింద కంపెనీ నాలుగు మోడళ్లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. బేస్ ఐఫోన్‌15 వేరియంట్, ఐఫోన్‌15 Plus, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు ఉన్నాయి. వీటిని త్వరలో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)