Breaking News

పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 15 డెడ్‌లైన్‌!

Published on Thu, 12/12/2024 - 16:46

ఆదాయ పన్ను చెల్లించేవారు ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు తెలుసుకోవడం మాత్రమే కాదు, దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 15 వచ్చేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుకు ఇదే చివరి గడువు.

డిసెంబర్ 15లోపు మూడో విడత పన్ను చెల్లించాలి. లేకుంటే భారీ ఫెనాల్టీ చెల్లించడం మాత్రమే కాకుండా.. చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా పన్నులు చెల్లించడం వల్ల జరిమానాలను నివారించవచ్చు. రూ.10,000 కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారు.. జూన్ 15, సెప్టెంబరు 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీలలో నాలుగు వాయిదాలలో ముందస్తు పన్ను చెల్లించాలి.

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను. మూడవ ముందస్తు పన్ను వాయిదా డిసెంబర్ 15, 2024న ముగుస్తుంది. ఆ రోజు ఆదివారం కాబట్టి.. చెల్లింపుదారులు ఎలాంటి జరిమానాలు లేకుండా సోమవారం (డిసెంబర్ 16) చెల్లించవచ్చు. ఈ సౌలభ్యం 1994లో జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. అప్పటి నుంచి ఈ నియమంలో ఎలాంటి మార్పు చేయలేదు. కాబట్టి ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు రోజు సెలవు దినం అయితే.. ఆ మరుసటి పనిదినంలో చెల్లించవచ్చు.

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ లెక్కించడం
ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో.. అందే అన్ని ర‌కాల ఆదాయాల‌ను అంచ‌నా వేయాలి. అంచ‌నా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న ప‌న్ను మిన‌హాయింపుల‌ను తీసివేయాలి. ఆ త‌ర్వాత మిగిలిన ఆదాయంపై ప‌న్నును లెక్కగట్టాలి. ఈ మొత్తం ప‌న్ను విలువ రూ.10 వేలు లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటే ముంద‌స్తు ప‌న్ను చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు చేయడం ఎలా?
●  ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలనుకునే వారు 'ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా' (భారత ఆదాయపు పన్ను శాఖ) ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని ఓపెన్ చేయాలి.
●  అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసిన తరువాత.. ఎడమవైపు క్విక్ లింక్స్ కింద కనిపించే 'ఈ-పే ట్యాక్స్' (e-Pay Tax)పై క్లిక్ చేయాలి. 
●  ఈ-పే ట్యాక్స్ ఓపెన్ చేసిన తరువాత పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.
●  ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మీ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. 
●  'ఇన్‌కమ్ ట్యాక్స్' కింద ట్యాక్స్ కేటగిరి ఎంచుకుని.. కంటిన్యూ అవ్వాలి.
●  అడ్వాన్స్ ట్యాక్స్ 100కు చెల్లించాలనుకుంటే.. కేటగిరి 100ను ఎంచుకోవాలి. 
●  ట్యాక్స్ మొత్తాన్ని ఎంచుకున్న తరువాత.. ఏ విధంగా చెల్లింపులు చేస్తారో సెలక్ట్ చేసుకోవాలి. 
●  ట్యాక్స్ చెల్లించడానికి ముందు.. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఆ తరువాత ట్యాక్స్ చెల్లించాలి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)