Breaking News

ఆదిత్య L1 లాంచ్‌ : ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర ట్వీట్‌ వైరల్‌

Published on Sat, 09/02/2023 - 16:55

Aditya L1 launch మిషన్‌ ఆదిత్య ఎల్‌ 1 పేరుతో ఇస్రో మరో ఘనతను  సాధించింది. సూర్యుడి పరిశోధనలు నిర్వహించేందుకు ఆదిత్య ఎల్‌1 మిషన్‌ను శనివారం  ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ మిషన్‌ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.  అటు  పారిశ్రామిక వేత్త, బిలియనీర్‌ ఆనంద్ మహీంద్ర కూడా దీనిపై స్పందించారు. ఈ సందర్బంగా  ట్విటర్‌(ఎక్స్‌)లో  ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు.  ఇండియా  తొలి సోలార్ మిషన్ పట్ల సంతోషాన్ని  వ్యక్తం చేస్తూగ్రీకు పురాణ గాథలొ మైనపు రెక్కలతో సూర్యునికి దగ్గరగా ఎగురుతూ మరణించిన డేడాలస్ కుమారుడు  ఇకారస్ కథను  గుర్తుచేసుకున్నారు. 

“‘సూర్యుడికి చాలా దగ్గరగా ఎగరవద్దు’ అనే సామెత గ్రీకు పురాణం నుంచి వచ్చింది.  గ్రీకు లెజెండ్‌ ఐకారస్ సూర్యుని దగ్గరగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అత్యాశకు ప్రతీకగా నిలిచిన ఈ మాటల్ని ఇక ఇస్రో చెరిపేయనుంది. మనం మన ఆశయాలను మరింత ఉన్నతంగా నిర్దేశించుకునేలా 'సూర్యుడికి దగ్గరగా ఎగురుదాం' అనే సందేశాన్నిస్తున్న ఇస్రోకు ధన్యవాదాలు అంటూ ఆయన రాశారు.ఈ సందర్బంగా ఆదిత్య ఎల్‌1 మిషన్‌ కు సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేశారు. దీంతో ఇది నెటిజన్లను  బాగా  ఆకట్టుకుంటోంది. (దివంగత రాకేష్‌ ఝన్‌ఝన్‌వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?)

మరోవైపు చంద్రయాన్‌-3 సక్సెస్ అంతరిక్షంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోందంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు  తెలిపారు. మానవాళి మనుగడ కోసం విశ్వంపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతాయని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.  (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత)

కాగా చంద్రయాన్‌-3 సక్సెస్‌ తరువాత  ఆదిత్య ఎల్‌ 1 ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.  శ్రీహరికోటలో 24 గంటల కౌంట్‌డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్‌ఎల్‌వీ-C57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సూర్యుడి ఎల్ 1 కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తాయి. అంతేకాదు చంద్రుని దక్షిణ ధృవంపై కాలినడి తొలిదేశంగా నిలిచిన భారత్‌ఇపుడు  అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత   సూర్యుడిపైకి రాకెట్ పంపిన దేశంగా భారత్ నిలిచింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి