Breaking News

60 వేలమందికి మొబైల్ నెంబర్ ఇచ్చిన సీఈఓ - ఎందుకంటే?

Published on Mon, 01/15/2024 - 17:17

సాధారణంగా ఒక కంపెనీ సీఈఓను కలవాలన్నా.. లేదా మాట్లాడాలన్నా పర్మిషన్ / అపాయింట్‌మెంట్‌ వంటి ప్రాసెస్ ఉంటాయి. కానీ ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ అడిడాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'బిజార్న్ గుల్డెన్' (Bjorn Gulden) ఇటీవల కంపెనీలో పనిచేసే 60000 మంది ఉద్యోగులకు తన మొబైల్ నెంబర్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

2023 జనవరిలో అడిడాస్ కంపెనీ సీఈఓగా గుల్డెన్‌ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంస్థ కొన్ని ఆర్థిక నష్టాల్లో ఉండేది. అంతే కాకుండా అడిడాస్.. అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్‌తో సంబంధాలను తెంచుకుంది. అలాంటి ఒడిదుడుకులను దాటుకుంటూ కంపెనీ లాభాల్లో పయనించేలా చేసిన ఈయన పనిలో పారదర్శకతను పెంచడానికి తన మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు వెల్లడించారు.

గుల్డెన్‌ తన మొబైల్ నెంబర్ ఇచినప్పటి నుంచి 200 కాల్స్ వచ్చాయని.. వ్యాపారంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆ కాల్స్ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు.

1990 తరువాత గుల్డెన్ అడిడాస్ వదిలి ప్యూమా కంపెనీలో చేరాడు. ఆ తరువాత 2023 జనవరిలో అడిడాస్‌కు తిరిగి వచ్చాడు. గుల్డెన్ తిరిగి కంపెనీయికి రావడంతో సంస్థ షేర్లు దాదాపు రెండింతలు పెరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా కంపెనీ ప్రత్యర్థి నైక్ కంటే మెరుగైన పనితీరు కనబరిచింది.

ఇదీ చదవండి: టెక్ దిగ్గజాల్లో అలజడి.. నాలుగు కంపెనీలలో 50000 మంది

స్వతహాగా ఫుట్‌బాల్ ఆటగాడైన గుల్డెన్.. కంపెనీలో అనేక మార్పులు చేశారు. సంస్థ ఉత్పత్తులను క్రికెట్ రంగానికి మరింత దగ్గర చేశారు. 2023లో భారత క్రికెట్ జట్టుతో బ్రాండ్ స్పాన్సర్‌షిప్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, సంస్థ మూడు నెలల్లో భారతదేశంలో 6,00,00 జెర్సీలను విక్రయించింది. రాబోయే రోజుల్లో అడిడాస్ మరింత వృద్ధి సాదిస్తుందని పలువురు ఆశిస్తున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)