Breaking News

రూ.2 వేలకోట్ల ఆర్థిక సహాయానికి ఏడీబీ ఆమోదం

Published on Thu, 07/18/2024 - 12:32

సోలార్‌ రూఫ్‌టాప్ సిస్టమ్‌ల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్రానికి 240.5 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ.2 వేల కోట్లు) రుణం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పేర్కొంది.  

ఈ సందర్భంగా ఏడీబీ ప్రిన్సిపల్ ఎనర్జీ స్పెషలిస్ట్ కౌరు ఒగినో మాట్లాడుతూ..‘ఏడీబీకు చెందిన మల్టీ ట్రాంచ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ.. సోలార్ రూఫ్‌టాప్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ 2, 3 దశలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. భారతదేశం 2030 నాటికి శిలాజ రహిత ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్‌ స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఏడీబీ ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రజలను ప్రోత్సహించేలా ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం ఎంతో ఉపయోగపడుతుంది’ అని తెలిపారు.

ఇదీ చదవండి: తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?

కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఫిబ్రవరిలో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించారు. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో.. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రాయితీపై రుణాలు పొందే వీలు కల్పిస్తున్నారు.
 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)