Breaking News

అంబానీ ‘పవర్‌’ను కొంటున్న అదానీ పవర్‌!

Published on Mon, 08/19/2024 - 19:52

దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్‌తో సహా అనేక రంగాలలో ఉన్న అదానీ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న ఆయన  విద్యుత్ రంగంలో మరో ముందడుగు వేసే యోచనలో ఉన్నారు.

రూ. 2.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన అతని అదానీ పవర్.. నాగ్‌పూర్‌లో ఉన్న బుటిబోరి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోందని ‘మింట్’ నివేదిక పేర్కొంది. ఈ పవర్ ప్రాజెక్ట్‌కు రుణదాతగా ఉన్న సీఎఫ్‌ఎం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీతో అదానీ గ్రూప్ మాట్లాడుతోందని, ఈ డీల్ విలువ రూ.2,400 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని నివేదిక పేర్కొంది.

ఈ పవర్ ప్లాంట్ ఒకప్పుడు అనిల్ అంబానీకి చెందిన దివాలా తీసిన రిలయన్స్ పవర్ ఆధీనంలో ఉండేది. ఇది ఇప్పుడు రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ అయిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ కింద ఉంది. ఈ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 600 మెగావాట్లు. ఈ వార్తల తర్వాత సోమవారం (ఆగస్టు 19) రిలయన్స్ పవర్ షేర్లు 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.32.79 వద్ద ముగిసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)