Breaking News

కార్గోలో అదానీ పోర్ట్స్‌ రికార్డ్‌

Published on Fri, 04/07/2023 - 01:55

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్‌ ఈ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కార్గో పరిమాణంలో సరికొత్త రికార్డు సాధించింది. 33.9 కోట్ల టన్నుల కార్గోను హ్యాండిల్‌ చేసింది. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధికాగా.. తద్వారా అత్యధిక పోర్ట్‌ కార్గోను నమోదు చేసింది.

(ఇది కూడా చదవండి:  సర్కార్‌  కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్‌ సింగ్‌?)

కంపెనీ వివరాల ప్రకారం గత నెల(మార్చి)లోనే 9.5 శాతం అధికంగా 3.2 కోట్ల టన్నుల కార్గోను నిర్వహించింది. 2022 జులై తదుపరి కార్గో పరిమాణంలో తొలిసారి 3 కోట్ల టన్నుల మార్క్‌ను అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గత కొన్నేళ్లుగా దేశీ కార్గో పరిమాణంలో  మార్కెట్‌ వాటాను పెంచుకుంటూ వస్తున్నట్లు అదానీ పోర్ట్స్‌ తెలియజేసింది. (ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి వేల కోట్లు)

పశ్చిమ తీరప్రాంతంలో ఆరు, తూర్పుతీరంలో ఐదు పోర్టులను కలిగి ఉన్న  కంపెనీ మరిన్ని పోర్టులను జత చేసు కుంటోంది. తద్వారా అతిపెద్ద పోర్టుల నిర్వాహక కంపెనీగా నిలుస్తోంది. ఈ బాటలో ఈ వారం మొదట్లో కరైకాల్‌ పోర్టును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 11 పోర్టులతో మొత్తం కార్గో పరిమాణంలో 25 శాతాన్ని హ్యాండిల్‌ చేస్తోంది. శ్రీలంకలోని కొలంబో, కేరళలోని విజింజంలో ట్రాన్షిప్‌మెంట్‌ పోర్టులను అభివృద్ధి చేస్తోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)