Breaking News

రూ. 21,900 కోట్లు చెల్లించేసిన అదానీ గ్రూప్‌

Published on Wed, 06/07/2023 - 08:30

న్యూఢిల్లీ: ముందస్తు చెల్లింపుల కార్యాచరణలో భాగంగా 2.65 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 21,900 కోట్లు) రుణాలను తీర్చివేసినట్లు అదానీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. తద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తిరిగి పొందనున్నట్లు గ్రూప్‌ విడుదల చేసిన క్రెడిట్‌ నోట్‌ పేర్కొంది. యూఎస్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల నివేదిక తదుపరి అదానీ గ్రూప్‌ రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తోంది.

లిస్టెడ్‌ కంపెనీల షేర్ల తనఖా సంబంధిత 2.15 బిలియన్‌ డాలర్ల రుణాలు తిరిగి చెల్లించినట్లు నోట్‌ వెల్లడించింది. అంతేకాకుండా అంబుజా సిమెంట్‌ కొనుగోలుకి తీసుకున్న 70 కోట్ల డాలర్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు తెలియజేసింది. 20.3 కోట్ల డాలర్ల వడ్డీతోకలిపి రుణాలు చెల్లించినట్లు వివరించింది. కాగా.. ప్రమోటర్లు గ్రూప్‌లోని నాలుగు లిస్టెడ్‌ కంపెనీలలో షేర్ల విక్రయం ద్వారా జీక్యూజీ పార్ట్‌నర్స్‌ నుంచి 1.87 బిలియన్‌ డాలర్లు(రూ. 15,446 కోట్లు) సమకూర్చుకున్నట్లు క్రెడిట్‌ నోట్‌ తెలియజేసింది.

రుణభార తగ్గింపు చర్యలు.. యాజమాన్య పటిష్ట లిక్విడిటీ నిర్వహణ, నిధుల సమీకరణ సమర్థతలను చాటుతున్నట్లు పేర్కొంది.అదానీ గ్రూప్‌లో అకౌంట్ల అవకతవకలు, షేర్ల ధరల కృత్రిమ పెంపు వంటివి జరిగినట్లు హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసింది. అయితే అదానీ గ్రూప్‌ వీటిని కొట్టిపారేయడంతోపాటు.. ముందస్తు రుణ చెల్లింపులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)