Breaking News

అదానీ గ్రీన్‌ నిధుల సమీకరణకు సై

Published on Fri, 07/07/2023 - 05:34

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ అదానీ గ్రీన్‌ ఎనర్జీ నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. షేర్ల విక్రయం ద్వారా రూ. 12,300 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చనట్లు గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీ తాజాగా వెల్లడించింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్‌) మార్గంలో నిధులను సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. కంపెనీ విస్తరణ ప్రణాళికలకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఇటీవల గ్రూప్‌లోని మరో రెండు కంపెనీలు సైతం నిధుల సమీకరణ ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

క్విప్‌ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 12,500 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్‌ రూ. 8,500 కోట్లు చొప్పున సమకూర్చుకోనున్నట్లు ఇప్పటికే తెలియజేశాయి. ప్రధానంగా యూరప్, మధ్యప్రాచ్యం నుంచి ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్‌ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నివేదిక వెలువడిన తదుపరి అదానీ గ్రూప్‌ కంపెనీలు పెట్టుబడుల సమీకరణ, కొత్త ప్రాజెక్టులతో విస్తరణకు తెరతీశాయి. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను తోసిపుచి్చన గ్రూప్‌ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మరింత పెంచేందుకు వీలుగా ముందస్తు రుణ చెల్లింపులకు ప్రాధాన్యమిస్తున్న విషయం విదితమే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)