Breaking News

అదానీ గ్రీన్‌కు టోటల్‌ ‘ఎనర్జీ’

Published on Thu, 12/28/2023 - 05:29

న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్‌ రంగ కంపెనీ అదానీ గ్రీన్‌ ఎనర్జీలో ఫ్రెంచ్‌ దిగ్గజం టోటల్‌ఎనర్జీస్‌ 30 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసింది. తద్వారా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్య సంస్థ(జేవీ)లో సమాన వాటా తీసుకుంది. అదానీ రెనెవబుల్‌ ఎనర్జీ నైన్‌ లిమిటెడ్‌(ఏఆర్‌ఈ9ఎల్‌) పేరుతో జేవీని ఏర్పాటు చేశాయి. 1,050 మెగావాట్ల ప్రాజెక్ట్‌ పోర్ట్‌ఫోలియోగల జేవీలో అదానీ గ్రీన్, టోటల్‌ఎనర్జీస్‌ 50:50 శాతం చొప్పున వాటాను తీసుకున్నాయి. అదానీ గ్రీన్‌కు ఏఆర్‌ఈ9ఎల్‌ అనుబంధ సంస్థకాగా.. 300 మెగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు, 500 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

మరో 250 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్లు అదానీ గ్రీన్‌ వెల్లడించింది. అదానీ గ్రీన్‌లో 19.75 శాతం వాటా కలిగిన టోటల్‌ఎనర్జీస్‌ గతంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ ట్వంటీ త్రీ(ఏజీఈ23) లిమిటెడ్‌లో ఇన్వెస్ట్‌ చేసింది. ఇది అదానీ గ్రీన్‌కు మరో అనుబంధ సంస్థ. కాగా.. నిర్మాణం, అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభిస్తే కొన్ని ప్రమాణాలకు లోబడి టోటల్‌ఎనర్జీస్‌ తిరిగి జేవీకి అదనపు పెట్టుబడులను సమకూర్చనుంది. ఇంతక్రితం ఏజీఈ23ఎల్‌లో టోటల్‌ రూ. 4,013 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. తప్పనిసరిగా మారి్పడికి లోనయ్యే డిబెంచర్ల ద్వారా నిధులు సమకూర్చింది.  
 
టోటల్‌ పెట్టుబడుల నేపథ్యంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,597 వద్ద ముగిసింది. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)