Breaking News

గ్రీన్‌ ఎనర్జీపై అదానీ దృష్టి 

Published on Wed, 12/27/2023 - 01:52

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రూప్‌ పర్యావరణహిత(గ్రీన్‌) ఇంధనం(ఎనర్జీ)కి మరింత ప్రాధాన్యత ఇస్తోంది. 2030కల్లా 45 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా అదానీ కుటుంబం రూ. 9,350 కోట్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధపడుతోంది. గ్రూప్‌ కంపెనీ అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌(ఏజీఈఎల్‌) ప్రమోటర్‌ కుటుంబీకులతోపాటు ఆర్డౌర్‌ ఇన్వెస్ట్‌మెంట్, హోల్డింగ్‌ లిమిటెడ్, అదానీ ప్రాపర్టిస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు మొత్తం 6.31 కోట్ల వారంట్లను జారీ చేయనుంది.

ఒక్కో వారంట్‌ను రూ. 1,480.75 ధరలో కేటాయించేందుకు కంపెనీ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనున్నట్లు అదానీ గ్రీన్‌ పేర్కొంది. తాజా పెట్టుబడుల కారణంగా కంపెనీలో ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు 3.83 శాతం వాటా లభించనుంది. వచ్చే ఏడాది 1.2 బిలియన్‌ డాలర్ల విలువైన బాండ్ల గడువు తీరనుంది. ఇప్పటికే వీటి చెల్లింపులు లేదా రీఫైనాన్సింగ్‌కు కంపెనీ ప్రణాళికలు వేసింది. 19.8 గిగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకి అదానీ గ్రీన్‌ ఇప్పటికే ఒప్పందాన్ని పీపీఏ కుదుర్చుకుంది.  ప్రమోటర్‌ పెట్టుబడుల వార్తలతో అదానీ గ్రీన్‌ షేరు బీఎస్‌ఈలో 4.3 శాతం ఎగసి రూ. 1,600 వద్ద ముగిసింది. 
 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)