Breaking News

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు నిధులు

Published on Thu, 07/10/2025 - 06:19

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బాండ్ల జారీ విజయవంతమైంది. బాండ్ల ఇష్యూ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పూర్తి సబ్ర్‌స్కిప్షన్‌  లభించింది. వెరసి మారి్పడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించింది. బుధవారం(9న) ప్రారంభమైన ఎన్‌సీడీ ఇష్యూ ఈ నెల 22న ముగియనుంది. అయితే అధిక స్పందన కారణంగా గడువుకంటే ముందుగానే ముగించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

నిర్ధారిత(ఫిక్స్‌డ్‌) వడ్డీ రేటుతో ఇన్వెస్టర్లకు బాండ్లను(ఎన్‌సీడీలు) జారీ చేయడం ద్వారా కంపెనీలు నిధులు సమీకరించే సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా 9.3 శాతం వార్షిక వడ్డీతో ఎన్‌సీడీలను ఆఫర్‌ చేసింది. ఇష్యూకి మధ్యాహా్ననికల్లా రూ. 1,400 కోట్ల విలువైన బిడ్స్‌ దాఖలైనట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీల డేటా వెల్లడించింది. ముందుగా వచ్చినవారికి ముందుగా పద్ధతిలో కంపెనీ బాండ్ల ఇష్యూని చేపట్టడం గమనార్హం! 

ఇది రెండో ఇష్యూకాగా.. కంపెనీ ఇంతక్రితం గతేడాది సెప్టెంబర్‌లోనూ రూ. 800 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసింది. రూ. 500 కోట్ల ప్రాథమిక విలువతో ప్రస్తుత ఆఫరింగ్‌ను చేపట్టింది. అధిక స్పందన లభిస్తే మరో రూ. 500 కోట్ల విలువైన బాండ్ల జారీకి వీలుగా గ్రీన్‌షూ ఆప్షన్‌తో ఇష్యూకి తెరతీసింది. ఒక్కో ఎన్‌సీడీ ముఖవిలువ రూ. 1,000కాగా.. ఇన్వెస్టర్లు కనీసం 10 బాండ్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధుల్లో కనీసం 75 శాతాన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఎన్‌సీడీలను 24, 36, 60 నెలల గడువుతో జారీ చేస్తోంది.  

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు బీఎస్‌ఈలో స్వల్ప నష్టంతో రూ. 2,582 వద్ద ముగిసింది. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)