అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు బొగ్గు సెగ 

Published on Fri, 01/31/2025 - 06:33

న్యూఢిల్లీ: బొగ్గు అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏఈఎల్‌) నికర లాభం ఏకంగా 97 శాతం క్షీణించింది. రూ. 58 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ నికర లాభం రూ. 1,888 కోట్లుగా నమోదైంది. ప్రధాన వినియోగదారయిన విద్యుత్‌ రంగంలో పునరుత్పాదక వనరుల వాటా పెరిగి బొగ్గుకు డిమాండ్‌ తగ్గడంతో అమ్మకాల పరిమాణం ఏకంగా 42 శాతం మేర క్షీణించింది.

 ఇక ఆ్రస్టేలియా కార్యకలాపాలకు సంబంధించి విదేశీ మారకంపరంగా నష్టాలు నమోదు కావడం కూడా తాజా పనితీరుకు కారణమయ్యాయి. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం 9 శాతం తగ్గి రూ. 22,848 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఆదాయం 6 శాతం పెరిగి రూ. 72,763 కోట్లకు చేరగా, నికర లాభం 17 శాతం వృద్ధి చెంది రూ. 3,254 కోట్లకు ఎగిసింది.  

గురువారం బీఎస్‌ఈలో ఏఈఎల్‌ షేరు సుమారు మూడు శాతం క్షీణించి రూ. 2,253 వద్ద క్లోజయ్యింది.   

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)