గౌతమ్ అదానీ కొత్త ప్లాన్.. వియత్నాంలో పోర్ట్!

Published on Sun, 07/14/2024 - 16:34

ఇజ్రాయెల్‌లోని హైఫా, శ్రీలంకలోని కొలంబో, టాంజానియా ఓడరేవు డార్ ఎస్ సలామ్ తర్వాత నాల్గవ అంతర్జాతీయ నౌకాశ్రయంగా కీర్తి గడిస్తున్న అదానీ పోర్ట్ కార్యకలాపాలు వియత్నాంలో కూడా ప్రారంభయ్యే అవకాశం ఉంది. దీనికోసం అదానీ గ్రూప్ వియత్నాంలో ఓడరేవును నిర్మించాలని యోచిస్తోంది.

భారతదేశంలో ప్రముఖ ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎప్పటికప్పుడు విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింతగా ఉపయోగించుకునేందుకు అంతర్జాతీయ ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తోంది. తద్వారా లాభాలను గడిస్తోంది.

భారతదేశపు అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ), వియత్నాంలోని డా నాంగ్‌లో ఓడరేవును అభివృద్ధి చేయడానికి వియత్నాం ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం పొందినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని, పెట్టుబడులకు సంబంధించిన మొత్తం ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు.

గౌతమ్ ఆదానీ.. తన అదానీ పోర్ట్ విస్తరణను లక్ష్యంగా చేసుకుని అధిక ఉత్పత్తి లేదా అధిక జనాభా ఉన్న దేశాలలో ఓడరేవులను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. అదానీ పోర్ట్స్ ప్రస్తుతం మొత్తం వాణిజ్య పరిమాణంలో 5 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి పొందుతోంది. ఇది 2030 నాటికి 10 శాతానికి చేరుకోవడానికి తగిన సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..

అదానీ గ్రూప్ కేరళలోని విజింజం ఓడరేవును ప్రారంభించనుంది. ఇప్పటికే ఇక్కడ మొదటి దశ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. ఈ పోర్ట్ 2028-29 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. దీనికోసం ఏకంగా రూ. 20000 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)