అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కి డిజిటల్‌ సొల్యూషన్స్‌ దన్ను

Published on Wed, 10/01/2025 - 09:48

ప్రయాణికులు, భాగస్వాములకు మరింత మెరుగైన అనుభూతిని అందించే దిశగా తమ విమానాశ్రయాల్లో డిజిటల్‌ సొల్యూషన్స్‌ను విస్తృతంగా వినియోగించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌ (ఏఏహెచ్‌ఎల్‌) తెలిపింది. డిజిటల్‌ వ్యూహంలో భాగంగా ఏవియో, అదానీ వన్‌యాప్, ఎయిర్‌పోర్ట్‌ ఇన్‌ ఏ బాక్స్‌ లాంటి స్మార్ట్‌ ప్లాట్‌ఫాంలను ఉపయోగించనున్నట్లు వివరించింది.

కార్యకలాపాలను సాఫీగా నిర్వహించుకోవడంలో ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, గ్రౌండ్‌ హ్యాండ్లర్స్, సర్వీస్‌ ప్రొవైడర్లకు ఏవియో సహాయపడుతుంది. మరోవైపు, ఎయిర్‌పోర్ట్‌ సర్వీసున్నింటినీ ఒకే చోట అందించే డిజిటల్‌ ప్లాట్‌ఫాం అదానీ వన్‌యాప్‌ ఉపయోగపడుతుంది. దేశంలో తొలిసారిగా ఆయా విమానాశ్రయాల్లో ప్రత్యేకమైన సర్వీసులను, అదానీ రివార్డ్స్‌ లాయల్టీ ప్రోగ్రాం ప్రయోజనాలను పొందవచ్చు.

ఎయిర్‌పోర్ట్‌ ఇన్‌ ఏ బాక్స్‌ ప్లాట్‌ఫాం ప్రస్తుత కార్యకలాపాల కోసం మౌలిక సదుపాయాలను పటిష్టపర్చుకోవడంతో పాటు భవిష్యత్‌ విస్తరణ అవసరాల్లోనూ సహాయకరంగా ఉంటుంది. అదానీ గ్రూప్‌నకు చెందిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలోనే ప్రారంభించనున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఏహెచ్‌ఎల్‌కి ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి, జైపూర్, లక్నో విమానాశ్రయాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు.. ఎంతంటే..

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)