Breaking News

ఇంధన డిమాండ్‌ తగ్గితే ఏటా 2 లక్షల కోట్ల డాలర్ల ఆదా

Published on Thu, 01/11/2024 - 06:19

న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఇంధన వినియోగ డిమాండ్‌ తీవ్రతను తగ్గించుకునేలా తగిన చర్యలు తీసుకోగలిగితే ప్రపంచ ఎకానమీకి ఏటా 2 లక్షల కోట్ల (ట్రిలియన్‌) డాలర్లు ఆదా కాగలవని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ఒక నివేదికలో వెల్లడించింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు, గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలను తగ్గించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొంది. జనవరి 15–19 మధ్య దావోస్‌లో వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్‌ ఈ నివేదికను విడుదల చేసింది.

కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీతో కలిసి తయారు చేసిన ఈ రిపోర్టు రూపకల్పనలో 120 మంది పైగా గ్లోబల్‌ సీఈవోలు సహాయ, సహకారాలు అందించారు. ప్రభుత్వాలు విధానపరంగా సరైన చర్యలు తీసుకుంటే వృద్ధి.. ఉత్పాదకతకు తో డ్పాటు లభించగలదని, కంపెనీలు నిధులను ఆదా చేసుకోగలవని, కాలుష్యకారక ఉద్గారాలను తగ్గించగలవని నివేదిక పేర్కొంది. ఫ్యాక్టరీ లైన్లను డిజైన్‌ చేయడంలో కృత్రిమ మేథను ఉపయోగించుకోవడం, విద్యుత్‌ వినియోగంలో సమర్ధతను మెరుగుపర్చుకోవడం, రవాణా వ్యవస్థను విద్యుదీకరించ డం మొదలైన చర్యలను పరిశీలించవచ్చని సూచించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)