Breaking News

అత్యధిక సాలరీ ప్యాకేజీ: రూ.1.8 కోట్లు!

Published on Mon, 06/05/2023 - 17:42

సాధారణంగా ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదివిన విద్యార్థులు అత్యధిక సాలరీ ప్యాకేజీలు దక్కించుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అయితే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) పాట్నా విద్యార్థి అభిషేక్ కుమార్ 2022లో అమెజాన్ (Amazon) నుంచి రూ. 1.8 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ను అందుకుని రికార్డ్‌ సృష్టించాడు. 

అభిషేక్ కుమార్ అందుకున్న రూ.1.8 కోట్ల ప్యాకేజీనే ఇప్పటివరకు అత్యధిక శాలరీ ప్యాకేజీగా భావిస్తున్నారు.  ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులకు కూడా ఈ స్థాయిలో ప్యాకేజీ లభించలేదు. బిహార్‌లోని ఝఝా నగరానికి చెందిన అభిషేక్ కుమార్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌ విద్యార్థి. 2022 ఏప్రిల్ 21న అమెజాన్‌ నుంచి తన నియామకానికి సంబంధించిన ధ్రువీకరణను అందుకున్నాడు. 2021 డిసెంబర్‌లో కోడింగ్ పరీక్షలో పాల్గొన్న అభిషేక్ కుమార్ ఆపై 2022 ఏప్రిల్ 13న మూడు రౌండ్ల ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. నివేదికల ప్రకారం.. అభిషేక్‌ని జర్మనీ, ఐర్లాండ్‌ దేశాలకు చెందిన నిపుణులు ఇంటర్వ్యూ చేశారు. బ్లాక్‌చెయిన్‌లో తనకున్న పరిజ్ఞానంతో వారిని ఆకట్టుకుని అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.

అభిషేక్ నైపుణ్యాలివే.. 
తన నైపుణ్యాల గురించి అభిషేక్ కుమార్ తన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. దాని ప్రకారం.. అభిషేక్ కుమార్‌కు  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఒక సంవత్సరం అనుభవం ఉంది. Java, C++, Spring boot, Javascript, Linuxతోపాటు వివిధ డేటాబేస్‌లలో అనుభవం ఉంది. నెట్‌వర్కింగ్, బ్యాకెండ్ అండ్‌  డేటాబేస్ ఇంజనీరింగ్ గురించి లోతైన పరిజ్ఞానం ఉంది. 

అభిషేక్ కుమార్ కంటే ముందు నిట్‌ పాట్నాకు చెందిన అదితి తివారీ ఫేస్‌బుక్ నుంచి అత్యధికంగా రూ.1.6 కోట్ల వేతన ప్యాకేజీ, పాట్నా అమ్మాయి సంప్రీతి యాదవ్ గూగుల్ నుంచి రూ.1.11 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు.
 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)