Breaking News

ఆధార్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!

Published on Tue, 06/24/2025 - 15:55

ఆధార్‌ కార్డులో అప్‌డేట్స్‌ చేయాలంటే ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది. ఆధార్‌ కార్డులో చిరునామా మార్చాలన్నా, మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేయాలన్నా, పేరు, పుట్టిన తేదీ.. వంటివాటిలో మార్పులు చేయాలన్నా ఇకపై ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సర్వీసులు అప్‌డేట్‌ చేస్తున్నారు. నేరుగా ఆన్‌లైన్‌లోనే నవంబర్‌ 2025 నుంచి సవరణ సదుపాయాన్ని కల్పించేలా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది.

ప్రభుత్వం ప్రకటించిన ఈ విధానం వల్ల భౌతిక పత్రాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ఆయా కేంద్రాలను సందర్శించే అసౌకర్యాన్ని తొలగిస్తుంది. అప్‌డేషన్‌ ‍ప్రక్రియ ఆన్‌లైన్‌ సేవల ద్వారా వేగవంతం అవుతుంది. ఈ సర్వీసుల ద్వారా సురక్షితంగా, సులభంగా కొత్త ఆధార్‌ను పొందే వీలుంటుంది. దేశంలోని కొన్ని లక్షల మందికి ఈ సర్వీస్‌ ఉపయోగకరంగా మారుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్‌కార్డులున్నాయా?

దరఖాస్తు సమయంలో పాన్, పాస్‌పోర్ట్‌, రేషన్ కార్డు వంటి ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్‌లో ఉన్న వివరాల ద్వారా యూఐడీఏఐ మీ వివరాలను తనిఖీ చేస్తుంది. పత్రాలను పదేపదే అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేకుండా ఇది నియంత్రిస్తుంది. విద్యుత్ బిల్లులు వంటి యుటిలిటీ బిల్లులను కూడా మీ చిరునామాను ధ్రువీకరించడానికి ఉపయోగించవచ్చు. నవీకరణ ప్రక్రియను ఈ చర్యలు గణనీయంగా క్రమబద్ధీకరిస్తాయి.

కొత్త మొబైల్‌ అప్లికేషన్‌..

క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ఆధార్‌తో కూడిన కొత్త మొబైల్ అప్లికేషన్‌ను యూఐడీఏఐ త్వరలో విడుదల చేయనుందని చెప్పింది. ఈ అప్‌డేట్‌తో ఇకపై మీ ఆధార్ కార్డు ఫిజికల్ ఫొటోకాపీలను సమర్పించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా వినియోగదారులు అవసరమైనప్పుడల్లా సురక్షితమైన డిజిటల్ లేదా మాస్క్ ఆధార్‌ను చూపించవచ్చు. మోసాలను అరికట్టడం, నకిలీ ఆధార్ కార్డుల చలామణిని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)