Breaking News

ఆధార్‌ ముఖ ధ్రువీకరణ లావాదేవీలు 1.06 కోట్లు

Published on Tue, 07/04/2023 - 06:00

న్యూఢిల్లీ: ఆధార్‌ ఆధారిత ముఖ ధ్రువీకణ లావాదేవీలు (గుర్తింపు ధ్రువీకరణ) మే నెలలో 10.6 మిలియన్లు (1.06 కోట్లు) నమోదయ్యాయి. ఈ లావాదేవీలు వరుసగా రెండో నెలలో కోటికి పైగా నమోదయ్యాయి. ‘‘ముఖ ధ్రువీకరణ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. నెలవారీ లావాదేవీలు ఈ ఏడాది జనవరి నెలతో పోల్చి చూసినప్పుడు మే నెలలో 38 శాతం అధికంగా నమోదయ్యాయి. దీని వినియోగం పెరుగుతుందన్న దానికి సంకేతం’’అని యూఐడీఏఐ ప్రకటించింది.

2021లో ఈ సేవను ప్రారంభించిన తర్వాత ఒక నెలలో అత్యధికంగా లావాదేవీల నమోదైంది ఈ ఏడాది మే నెలలోనేనని తెలిపింది. ఆధార్‌ ఆధారిత ముఖ ధ్రువీకరణ సేవలకు డిమాండ్‌ పెరుగుతున్నట్టు వివరించింది. యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఏఐ/మెíÙన్‌ లరి్నంగ్‌ ఆధారిత ముఖ ధ్రువీకరణ సొల్యూషన్‌ను ప్రస్తుతం 47 సంస్థలు వినియోగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంక్‌లు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నాయి.

ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, పీఎం కిసాన్‌ పథకంలో లబి్ధదారుల నమోదుకు, పెన్షనర్లు డిజిటల్‌ లైఫ్‌ సరి్టఫికెట్‌లు పొందేందుకు ఆధార్‌ ఆధారిత ముఖ ధ్రువీకరణను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల ప్రారంభానికీ దీన్ని తీసుకుంటున్నారు. వినియోగానికి సులభంగా ఉండడం, వేగంగా గుర్తింపు ధ్రువీకరణ, ఫింగర్‌ ప్రింట్, ఓటీపీలతో సౌకర్యవంతంగా ఉంటున్నట్టు యూఐడీఏఐ వివరించింది. మే నెలలో ఆధార్‌కు సంబంధించి 1.48 కోట్ల అప్‌డేట్‌ అభ్యర్థనలను కూడా పూర్తి చేసినట్టు తెలిపింది. ఇక బ్యాంకింగ్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రంగంలో ఆధార్‌ ఈ కేవైసీకి డిమాండ్‌ పెరుగుతోంది. మే నెలలో 25.4 కోట్ల ఈకేవైసీ లావాదేవీలు నమోదైనట్టు యూఐడీఏఐ
ప్రకటించింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)