Breaking News

ఎన్‌పీఎస్‌ కొత్త రూల్‌.. ఎలా లాగిన్‌ చేయాలో తెలుసా..

Published on Mon, 04/15/2024 - 14:41

కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లో అనేక ఆర్థిక సంస్థల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా నేషనల్‌ పెన్షన్‌ స్కీం(ఎన్‌పీఎస్‌) లాగిన్‌ అయ్యే విధానంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అ‍న్ని అకౌంట్‌లు ఆధార్‌తో లింక్‌ అవుతున్న తరుణంలో పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ).. ఆధార్‌ ఆధారిత లాగిన్‌ అథెంటికేషన్‌ను ప్రవేశపెట్టింది. దాంతో పాత విధానంలోకాకుండా కొత్త పద్ధతిలో ఎన్‌పీఎస్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. 

ఎలా లాగిన్‌ చేయాలంటే..

ఎన్‌పీఎస్‌ వెబ్‌సైట్‌లో పర్మనెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (పీఆర్‌ఏఎన్‌)/ ఇంటర్నెట్‌ పర్సనల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (ఐపీఐఎన్‌)తో లాగిన్‌ కావాలి. తర్వాత పీఆర్‌ఏఎన్‌/ ఐపీఐఎన్‌ టాబ్‌పై క్లిక్‌ చేయాలి. ఓ కొత్త విండో ఓపెన్‌ అవుతుంది. అక్కడ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత కింద ఉండే క్యాప్చా కోడ్‌ను టైప్‌ చేయాలి. తర్వాత తెరుచుకునే విండోలో ఆధార్‌ ఆథెంటికేషన్‌ పూర్తి చేయాలి. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేస్తే ఎన్‌పీఎస్‌ ఖాతా ఓపెన్‌ అవుతుంది.

ఇదీ చదవండి: ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)