Breaking News

కార్మిక శక్తిలో  70 శాతం మహిళలే

Published on Thu, 03/06/2025 - 06:36

న్యూఢిల్లీ: 2047 నాటికి వికసిత్‌ భారత్‌ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా ప్రకటించారు. అప్పటికి శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 70 శాతానికి పెంచనున్నట్టు చెప్పారు. సేవల రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. 

కొన్ని రంగాల్లో మహిళలు మరింత పెద్ద ఎత్తున పాలుపంచుకునేందుకు గొప్ప అవకాశాలున్నట్టు చెప్పారు. జాతీయ విద్యా విధానం కింద మహిళల విద్యార్హతల పెంపుపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లు, సంస్థలకు వెంచర్‌ క్యాపిటల్‌ మద్దతుకు పిలుపునిచ్చారు. ‘‘మహిళా వ్యాపారవేత్తలకు వెంచర్‌ క్యాపిటల్‌ మద్దతు ఎంతో కీలకం. వారు నాయకులుగా మారేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు మార్గదర్శకం అవసరం’’అని సుమిత దావ్రా పేర్కొన్నారు.  

వివక్ష ..
శ్రామికశక్తిలో మరింత మంది మహిళలు భాగస్వాములు కాకుండా వివక్ష వారిని అడ్డుకుంటున్నట్టు సుమితా దావ్రా పేర్కొన్నారు. వేతనం, నాయకత్వ బాధ్యతల్లో, ఉద్యోగ భద్రతలో అసమానతలు ఉన్నట్టు చెప్పారు. అయితే గడిచిన ఆరేళ్లలో ఆరి్థక కార్యకలాపాల్లో మహిళల పాత్ర పెరిగినట్టు చెప్పారు. అలాగే, విద్యావంతులైన మహిళలు ఉద్యోగాల్లో చేరడంలో, స్థిరమైన ఆర్జనలోనూ పురోగతి ఉన్నట్టు వివరించారు. ‘‘టెక్నాలజీ, ఫైనాన్స్‌ రంగాలతోపాటు తయారీలోనూ మహిళలు రాణిస్తుండడాన్ని చూస్తున్నాం. మహిళలకు సంబంధించి వర్కర్‌ పాపులేషన్‌ రేషియో (డబ్ల్యూపీఆర్‌) గత ఆరేళ్లలో రెట్టింపైనట్టు డేటా తెలియజేస్తోంది’’అని సుమితా దావ్రా చెప్పారు.  

హిందుస్థాన్‌ జింక్‌లో 30 శాతం మహిళలే 
2030 నాటికి తమ కంపెనీ ఉద్యోగుల్లో 30 శాతం మహిళలే ఉండాలన్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఉన్నట్టు వేదాంత గ్రూప్‌ కంపెనీ హిందుస్థాన్‌ జింక్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌) ప్రకటించింది. ప్రస్తుతం హిందుస్థాన్‌ జింక్‌ ఉద్యోగుల్లో మహిళలు 25% ఉన్నారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)