Breaking News

జీసీసీల్లో కొలువుల సందడి 

Published on Sun, 08/03/2025 - 04:41

న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ, జేఎల్‌ఎల్‌ ఇండియాతో కలిసి ట్యాగ్డ్‌ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 48 శాతం జీసీసీల్లో హైరింగ్‌ను పెంచుకోవడంపై సానుకూల సెంటిమెంటు నెలకొంది. 19 శాతం సంస్థలు 2024 ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే నియామకాలను కొనసాగించే యోచనలో ఉన్నాయి.

 ఇటు ఖర్చులు, అటు సమర్ధత మధ్య సమతౌల్యాన్ని పాటించేలా 1–5 ఏళ్ల అనుభవం గల వారిని రిక్రూట్‌ చేసుకోవడంపై జీసీసీలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. కెరియర్‌లో పెద్దగా పురోగతి లేకుండా 18–24 నెలల పాటు ఒకే హోదాలో ఉండిపోవడానికి జెనరెషన్‌ జెడ్‌ ప్రొఫెషనల్స్‌ ఇష్టపడకపోతుండటంతో, ఉద్యోగంలో కొనసాగే సగటు వ్యవధి గణనీయంగా తగ్గిపోతున్నట్లు నివేదిక పేర్కొంది. వివిధ రంగాలవ్యాప్తంగా 100కు పైగా జీసీసీలపై అధ్యయనం ఆధారంగా ఈ రిపోర్ట్‌ రూపొందింది.  

ప్రధాన హబ్‌లలోనే రిక్రూట్‌మెంట్‌.. 
ప్రధాన హబ్‌లుగా ఉంటున్న నగరాల నుంచే ఎక్కువగా రిక్రూట్‌ చేసుకోవాలని 60 శాతం జీసీసీలు భావిస్తున్నాయి. 29 శాతం సంస్థలు మాత్రం ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నగరాల మేళవింపుతో నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. ఇక 13 శాతం జీసీసీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి రిక్రూట్‌ చేసుకోనున్నాయి. కృత్రిమ మేథ (ఏఐ) కారణంగా జీసీసీల్లో నియామకాల ప్రక్రియలో గణనీయంగా మార్పులు వస్తున్నట్లు నివేదిక తెలిపింది. 48 శాతం జీసీసీలు ఏఐ ఆధారిత హైరింగ్‌ టూల్స్‌ను ఉపయోగించే యోచనలో ఉండగా, ఇప్పటికే 24 శాతం సంస్థలు వివిధ స్థాయుల్లో వాటిని ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)