ఒకటే రీజన్.. 3500 మంది ఉద్యోగులు బయటకు..!

Published on Fri, 02/02/2024 - 11:47

జర్మనీలో అతిపెద్ద లెండర్ 'డ్యుయిష్ బ్యాంక్' తాజాగా 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. 2023లో బ్యాంక్ లాభాలు భారీగా తగ్గిపోవడం వల్ల సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

2022 కంటే కూడా 2023లో సంస్థ లాభాలు 16 శాతం తగ్గడం మాత్రమే కాకుండా, ఖర్చులు పెరగడం వల్ల డ్యుయిష్ బ్యాంక్ 3500 మందిని తొలగించడానికి సన్నద్ధమవుతోంది.

ఐరోపా సెంట్రల్ బ్యాంక్ అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆదాయం సంవత్సరానికి ఆరు శాతం పెరిగి 28.9 బిలియన్ యూరోలకు చేరుకుందని, అనిశ్చితి వాతావరణంలో కూడా బ్యాంక్ పనితీరు అద్భుతంగా ఉందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'క్రిస్టియన్ సివింగ్' ప్రశంసించారు. కానీ బ్యాంక్ మరింత లాభాలను పొందే క్రమంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని వెల్లడించారు.

ఇదీ చదవండి: విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు!

2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా డ్యుయిష్ బ్యాంక్‌ 85000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నంలో ఖర్చులను తగ్గించుకుని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి లేఆప్స్ చేస్తున్నట్లు సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)