Breaking News

పండగ సందడి షురూ: టాటా సీఎన్‌జీ కార్లు వచ్చేశాయ్‌!

Published on Sat, 08/05/2023 - 10:02

Tata CNG Cars: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పండుగ సీజన్‌ సందడిని స్టార్ట్‌ చేసింది. కొత్త కార్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమై పోయింది.  టాటా ఒకటి కాదు ఏకంగా మూడు సీఎన్‌జీ కార్లను లాంచ్  చేసింది. పంచ్ i-CNG లాంచ్‌తోపాటు,  ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టిగోర్‌, టియాగో  సీఎన్‌జీని కూడా  అప్‌డేట్ చేసింది.

 టాటా పంచ్‌ ఐ-సీఎన్‌జీ
మైక్రో ఎస్‌యూవీ పంచ్‌ సీఎన్‌జీ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూంలో ధర రూ.7,09,900 మొదలకుని రూ.9,67,900 వరకు ఉంది. ట్విన్‌ సిలిండర్‌ టెక్నాలజీతో 1.2 లీటర్‌ రివొట్రాన్‌ సీఎన్‌జీ ఇంజన్‌తో  రూపుదిద్దుకుంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ పొందుపరిచారు. పెట్రోల్, సీఎన్‌జీతో నడుస్తుంది. 37 లీటర్ల పెట్రోల్, 60 లీటర్ల సీఎన్‌జీ ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఏర్పాటు ఉంది. సీఎన్‌జీ కేజీకి 26.99 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వాయిస్‌ అసిస్టెడ్‌ ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్, ఆటోమేటిక్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల హర్మాన్‌ ఇన్ఫోటైన్‌మెంట్, 16 అంగుళాల డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌ వంటి హంగులు ఉన్నాయి.   

కొత్త టాటా సీఎన్‌జీ కార్లు
టాటా ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టియాగో ఐ-సీఎన్‌జీని విడుదల చేసింది.  ధరల వారీగా, కొత్త టియాగో సిఎన్‌జి రూ. 7.46 లక్షలలు- రూ. 9.32 లక్షల మధ్య ఉంటుంది. ఆశ్చర్యకరంగా, టాటా మునుపటి  సీఎన్‌జీ మోడల్‌తో పోలిస్తే కేవలం 5వేలు మాత్రమే ధరను పెంచింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)