Breaking News

2023లో భారీగా పెరిగిన కార్ సేల్స్ - ఆ కంపెనీ కార్లకే డిమాండ్!

Published on Tue, 01/02/2024 - 20:16

భారతదేశంలో రోజు రోజుకి వాహన విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. 2022 కంటే కూడా 2023లో కార్ల అమ్మకాలు 8.3 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనల్లో వివరంగా తెలుసుకుందాం.

2023 లో చిన్న కార్ల అమ్మకాలతో పోలిస్తే ఎస్‌యూవీల అమ్మకాలు బాగా పెరిగాయి. మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి కంపెనీలు మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగాయి. 2022లో సగటున కారు ధర రూ.10.58 లక్షలు పలికితే 2023లో సరాసరి రూ.11.5 లక్షలకు పెరిగింది. 

మొత్తం అమ్మకాల్లో మారుతి సుజుకి హవా జోరుగా సాగింది. భారతీయ ప్యాసింజర్ వాహనాల పరిశ్రమ చరిత్రలో ఇదొక పెద్ద మైలురాయిగా భావిస్తున్నట్లు.. మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవస్తవ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఈవీ రంగంలో అద్భుతం.. 1000 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ

కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీల సేల్స్ 26 శాతం వృద్ధి చెందినట్లు సమాచారం. మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 2022లో 42 శాతం ఉంటే.. 2023లో ఈ సంఖ్య 48.7 శాతానికి పెరిగింది. హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్ల అమ్మకాలు 34.8 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. 

2023లో సెడాన్స్ విక్రయాలు 11 శాతం నుంచి 9.4 శాతానికి పతనం కాగా, మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు యధాతథంగా 8.7 శాతం వద్ద కొనసాగాయి.  దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా ఎగుమతుల సంఖ్య కూడా బాగా పెరిగింది. గత ఏడాది 2,69,046 యూనిట్లను ఎగుమతైనట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో 7.76 లక్షల కార్లు, ప్రీ-ఓన్డ్ కార్ల విక్రయాలు 4.68 లక్షల యూనిట్లుగా నిలిచాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)