Breaking News

1986లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!

Published on Fri, 04/07/2023 - 15:21

ఆధునిక కాలంలో ఎక్కువ మంది యువకులు ఇష్టపడే బైకులలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' ప్రధానంలో చెప్పుకోదగ్గవి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ఉన్న చరిత్ర అంతా.. ఇంతా కాదు. గతంలో తక్కువ తక్కువ సంఖ్యలో వినియోగంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు రోడ్డుపై విరివిగా కనిపిస్తున్నాయి.

భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు ఇప్పుడు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లభిస్తున్నాయి. అయితే 1986లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర కేవలం రూ. 18,700 మాత్రమే కావడం గమనార్హం. దీనికి సంబంధించిన బిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 4567k ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడైన పోస్ట్ చూస్తే 1986లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర ఎలా ఉందొ తెలిసిపోతుంది. ఈ బిల్ కూడా M/s R S ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ పేరు మీద ఉంది. ఇందులో ఈ బైక్ ధర రూ. 18,800 అని, రూ. 250 డిస్కౌంట్ లేదా ఇతరత్రా కారణాల వల్ల తగ్గించడం వల్ల దీని ధర రూ. 18,700 అని స్పష్టమవుతోంది.

అప్పటి ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలు సుమారు పది రెట్లు ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం స్టాండర్డ్ బుల్లెట్ 350 ఆన్-రోడ్ ధర సుమారు రూ .1.7 లక్షల వరకు ఉంది. 1901లో 'ఇంగ్లాండ్'లోని వోర్సెస్టర్ షైర్, రెడ్దిచ్ కు చెందిన కంపెనీ తమ మొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ తయారు చేసింది. ఆ తరువాత భారతీయ కార్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ లో భాగమైన భారత సంతతికి చెందిన మద్రాస్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి లైసెన్స్ పొందింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మొదట్లో ఎక్కువగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను వాడేవారు. 1954లోనే ప్రభుత్వం 800 యూనిట్ల 350 సిసి బైకులను కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే అప్పట్లోనే ఈ బైక్ ఎంత ఆదరణ పొందిందో అర్థమవుతుంది.

రెడ్డిచ్ బిజినెస్ భారతదేశంలోని 'మద్రాస్ మోటార్స్'తో కలిసి 1955లో "ఎన్ఫీల్డ్ ఇండియా" ను సృష్టించింది, తద్వారా మద్రాసు లైసెన్స్ కింద 350 సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ బైక్ ఉత్పత్తి చేసింది. దాదాపు 70 సంవత్సరాలు తరువాత ఏకంగా భారతీయ మార్కెట్లో తిరుగులేని బైకుగా చెలామణి అవుతోంది. ఏడు దశాబ్దాల తరువాత కంపెనీ ఇప్పుడు దేశంలో అత్యంత విజయవంతమైన ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటిగా మారింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)