Breaking News

5 కంపెనీల్లో రూ.1,67,936 కోట్ల ఆవిరి

Published on Mon, 01/22/2024 - 06:25

ముంబై: మార్కెట్లో అత్యంత విలువ కలిగిన తొలి 10 కంపెనీల్లో అయిదింటి విలువ గతవారం భారీగా క్షీణించింది. గడిచిన వారం రోజుల్లో ఈ అయిదు కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1,67,936 కోట్లు హరించుకుపోయాయి. గతవారం సెన్సెక్స్‌ 1,144 పాయింట్లు (1.57%) నష్టపోయింది. ఈ నెల 20న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సాధారణ ట్రేడింగ్‌ నిర్వహించాయి.  
రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీవీఎస్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆవిరైంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌ టెల్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ), ఐటీసీ సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పెరిగింది.

► అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,22,163.07 కోట్లు నష్టపోయి రూ.11,22,662.76 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్‌ డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాలు మార్కెట్లను మెప్పించలేకపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ షేర్ల విక్రయానికి పాల్పడ్డారు. దీంతో ఈ షేరు బుధ, గురు, శుక్రవారాల్లో 12% నష్ట పోయింది. శనివారం ట్రేడింగ్‌ లో తిరిగి పుంజుకుని 0.54% లాభ పడింది.
► రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.18,199.35 కోట్లు నష్టపోయి రూ.18,35,665.82 కోట్లకు పరిమితమైంది. హిందూస్థాన్‌ యూనీలివర్‌ (హెచ్‌ యూఎల్‌) మార్కెట్‌ క్యాప్‌ రూ.17,845.15 కోట్ల పతనంతో రూ.5,80,184.57 కోట్లతో సరిపెట్టుకున్నది. టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7,720.6 కోట్లు కోల్పోయి రూ.14,12,613.37 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్‌బీఐ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,008.04 కోట్లు నష్టపోయి రూ.5,63,589. 24 కోట్ల వద్ద ముగిసింది.
► ఎల్‌ఐసీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో ఎస్‌బీఐని దాటేయడంతో పాటు దేశంలోనే అత్యంత ఎక్కువ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గల సంస్థగా నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.26,380.94 కోట్లు పెరిగి రూ.6,31, 679.96 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.15,170.75 కోట్లు పుంజుకుని రూ.6,84,305.90 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,163.72 కోట్లు పెరిగి రూ.7,07,373.79 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,058.48 కోట్లు పుంజుకుని రూ.5,84,170.38 కోట్లకు పెరిగింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)