రూ.164 లక్షల కోట్లకు రిటైల్‌ మార్కెట్‌ 

Published on Sat, 02/25/2023 - 04:50

న్యూఢిల్లీ: దేశ రిటైల్‌ మార్కెట్‌ 2032 నాటికి 2 ట్రిలియన్‌ డాలర్లకు (రూ.164 లక్షల కోట్లు) చేరుకుంటుందని రిటైల్‌ వర్తకుల అసోసియేషన్‌ (రాయ్‌), ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ సంయుక్తంగా విడుదల చేసిన ఓ నివేదిలో పేర్కొన్నాయి. 2021 నాటికి రిటైల్‌ మార్కెట్‌ పరిమాణం 690 బిలియన్‌ డాలర్లు (56.5 లక్షల కోట్లు)గా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. సంఘటిత రిటైల్‌ రంగం విక్రయాలు 2021–22 నాటికి 52 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2028 నాటికి 136 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందుతుందని పేర్కొంది.

వచ్చే 4–5 ఏళ్లలో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 25 మిలియన్‌ చదరపు అడుగుల పరిధిలో కొత్త మాల్‌ వసతులను అభివృద్ధి చేయనున్నట్టు అంచనా వేసింది. 2022లో ఈ ఏడు పట్టణాల్లో 2.6 మిలియన్‌ చదరపు అడుగుల కొత్త మాల్‌ విస్తీర్ణం తోడైనట్టు తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువని పేర్కొంది.

2022 చివర్లో పండుగల సమయంలో విక్రయాల విలువ రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని, గతేడాదితో పోలిస్తే ఇది 2.5 రెట్లు అధికమని అనరాక్‌ రిటైల్‌ సీఈవో, ఎండీ అనుజ్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. సంఘటిత రిటైల్‌ మార్కెట్‌ ఏటా 25 శాతం చొప్పున కాంపౌండెడ్‌ వృద్ధి చూస్తుందని చెప్పారు.  

మూడు పట్టణాల్లో ఎక్కువ వసతులు 
భారత రిటైల్‌ రంగం 2019 నుంచి 2022 మధ్య 1,473 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు రాయ్‌ సీఈవో కుమార్‌ రాజగోపాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 51 మిలియ్‌ చదరపు అడుగులకు పైన మాల్‌ వసతులు ఉంటే, అందులో ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్, బెంగళూరు 62 శాతం వాటా ఆక్రమిస్తున్నట్టు చెప్పారు.

2022లో సగటున మాల్‌ అద్దె 15 శాతం పెరిగిందని, బెంగళూరులో అత్యధికంగా అద్దెలు 27 శాతం పెరిగితే, ఆ తర్వాత కోల్‌కతాలో 20 శాతం అధికమైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ–రిటైల్‌ మార్కెట్‌ పరిమాణం 2025–26 నాటికి 120–140 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)