Breaking News

మొబైల్ నెంబర్ కొత్త సిరీస్.. 160తో మొదలు - ఎందుకో తెలుసా?

Published on Mon, 06/03/2024 - 07:59

ప్రజలు చట్టబద్ధమైన కాల్‌లను సులభంగా గుర్తించడానికి, టెలిమార్కెటర్‌ల నుంచి వచ్చే అనుచిత వాయిస్ కాల్‌లను అరికట్టడానికి టెలికాం మంత్రిత్వ శాఖ 160xxxxxxx అనే కొత్త నెంబరింగ్ సిరీస్‌ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ప్రమోషనల్, సర్వీస్, ఇతర లావాదేవీల కోసం కేంద్రం టెలిమార్కెటర్‌లకు 140xxxxxx సిరీస్ కేటాయించింది. ఇది ఇకపై 160 నెంబర్ సిరీస్‌కు మారుతుంది. అంటే కస్టమర్ రిసీవ్ చేసుకునే టెలిమార్కెటర్‌ల కాల్ నెంబర్ 160 నెంబర్‌తో మొదలవుతుంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) 140 సిరీస్‌ను కాల్‌ల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న కారణంగా చాలామంది వాటికి రెస్పాండ్ అవ్వరు. కాబట్టి కొన్ని సార్లు ముఖ్యమైన సర్వీస్/లావాదేవీ కాల్‌లు మిస్ అవుతుంటారు. కాబట్టి ఇకపై అలంటి పొరపాట్లు జరగకుండా డాట్ ఈ 160 నెంబర్ సిరీస్‌ ప్రవేశపెట్టింది.

140 నెంబర్ సిరీస్ ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. వీటన్నింటిని అరికట్టడానికి కేంద్ర కొత్త సిరీస్ నెంబర్ తీసుకువచ్చింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా ప్రిన్సిపల్ ఎంటిటీల సర్వీస్/లావాదేవీ వాయిస్ కాల్‌ల కోసం ఉపయోగించనున్నారు. కాబట్టి ఈ నెంబర్ సర్వీస్/లావాదేవీ కాల్‌లకు.. ఇతర రకాల కాల్‌లకు మధ్య స్పష్టమైన భేదం చూపడాన్ని సులభతరం చేస్తుంది.

ఆర్‌బీఐ, సెబీ, పీఎఫ్‌ఆర్‌డీఎ, ఐఆర్‌డీఏ వంటి ఫైనాన్షియల్ ఎంటిటీల నుంచి వచ్చే సర్వీస్/లావాదేవీ కాల్‌లు 1601 నుంచి ప్రారంభమవుతాయి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 160 సిరీస్‌ నంబర్‌ను కేటాయించే ముందే తప్పకుండా ఖచ్చితమైన ద్రువీకరణను నిర్దారించుకోవాలని డాట్ పేర్కొంది. ఈ నెంబర్ సిరీస్ కేవలం సర్వీస్ / లావాదేవీలకు మాత్రమే ఉపయోగించబడుతుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)