Breaking News

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వంటగదిలోకి వెళితే..

Published on Mon, 06/08/2026 - 20:15

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌లో కొత్తగా చర్చనీయాంశంగా మారిన "ఫుడ్ క్రైమ్"పై కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ తనదైన శైలిలో స్పందించి నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తారు. బెంగళూరుకు చెందిన యశ్ అనే ప్రొడక్ట్ మేనేజర్ ఇడ్లీలను పిజా ముక్కల్లా త్రిభుజాకారంలో కట్ చేసి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి శ‌శిథ‌రూర్ త‌న‌దైన శైలిలో 'ఇడ్లీని పిజా ముక్కల్లా కట్ చేయడం ఏంట్రా బాబూ' అన్న‌ట్టుగా స్పందించారు.

"సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వంటగదిలోకి వెళ్లి డేటాను పార్టిషన్ చేయాలని ప్రయత్నిస్తే ఇదే జరుగుతుంది. దీనిని 'ఇడ్లీ' అంటారు, 'ఇడ్-స్లైస్' కాదు. ఇటాలియన్లు దాన్ని పిజాగా పొరబడితే తప్ప ఎవరూ ఇడ్లీని ఇలా తినరు. అయితే పిజాపై సాంబార్ పోయాలని మాత్రం ప్రయత్నించకండి" అంటూ తనదైన హాస్య శైలిలో ట్వీట్ చేశారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో ఇడ్లీ సంప్రదాయాల పరిరక్షకుడిగా శశి థరూర్ మరోసారి గుర్తింపు పొందారు.

థరూర్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజ‌నులు కూడా స‌ర‌దా కామెంట్లు పెట్టారు. కొందరు నెటిజన్లు ఇడ్లీలను "యాక్షనబుల్ యూనిట్స్"గా విభజించారని చమత్కరించగా, మరికొందరు యశ్ బ్రేక్‌ఫాస్ట్‌కే ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ సూత్రాలను వర్తింపజేశాడని, అందులో సెగ్మెంటేషన్, యూజర్ ఎక్స్‌పీరియన్స్, చట్నీ యాక్సెసిబిలిటీ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాడని సరదాగా వ్యాఖ్యానించారు. సౌకర్యం కోసం అలా చేసి ఉండొచ్చని కొందరు భావించినప్పటికీ, చాలామంది నెటిజన్లు మాత్రం దీనిని ఇడ్లీపై జరిగిన "కార్పొరేట్ ప్రయోగం"గా అభివర్ణించారు.

చ‌ద‌వండి: బొంగరపు ఆట నేర్పే జీవిత‌ సత్యాలు!

ఇటీవల కూడా "చాయ్‌తో ఇడ్లీ" అనే విచిత్రమైన ఆహార కలయిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో థరూర్ తీవ్ర అసమ్మతి వ్యక్తం చేశారు. దక్షిణ భారతీయులను ఆశ్చర్యానికి గురిచేసిన ఆ కలయికపై కూడా త‌న‌దైన స్టైయిల్లో స్పందించారు. చాయ్ కప్పులోనే ఉండాలి, ఇడ్లీ ప్లేట్‌లోనే ఉండాలి అంటూ సున్నితంగా కౌంట‌ర్ ఇచ్చారు. ఇడ్లీపై జరుగుతున్న ఈ వినూత్న ప్రయోగాలు సోషల్ మీడియాలో వినోదాన్ని పంచుతున్నప్పటికీ, సంప్రదాయ ఆహారాల విషయంలో ప్రజల భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటాయో మరోసారి స్పష్టమైంది.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)