Breaking News

భారత్‌లో లాంచ్ అయిన జర్మన్ బ్రాండ్ కార్లు - వివరాలు

Published on Fri, 05/10/2024 - 21:51

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో క్యూ3 SUV , క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ బోల్డ్ ఎడిషన్ వేరియంట్‌లను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కార్ల ధరలు వరుసగా రూ. 54.65 లక్షలు, రూ. 55.71 లక్షలు.

కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్లు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇంటీరియర్, పవర్‌ట్రెయిన్ విషయంలో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. బోల్డ్ ఎడిషన్ వేరియంట్లు ఎక్కువగా బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతాయి. ఇందులోని గ్రిల్‌పై గ్లోస్ బ్లాక్ ట్రీట్‌మెంట్, ఫ్రంట్ బంపర్‌పై ఎయిర్ ఇన్‌టేక్ సరౌండ్‌లు, విండో లైన్ సరౌండ్, వింగ్ మిర్రర్ క్యాప్స్, రూఫ్ రైల్స్ మొదలైనవి చూడవచ్చు. ఈ కార్లు 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి.

స్టాండర్డ్ వెర్షన్ కార్ల ధరలతో పోలిస్తే.. బోల్డ్ ఎడిషన్ ధరలు వరుసగా రూ. 1.48 లక్షలు, రూ. 1.49 లక్షలు ఎక్కువ. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఫోర్-వే లంబార్ సపోర్ట్‌తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ బోల్డ్ ఎడిషన్‌లు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్స్ 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)