Breaking News

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published on Sun, 04/27/2025 - 05:23

మేషం...
ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.  ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం  చివరిలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు.  శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం...
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దికుని ముందుకు సాగుతారు. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నీలం, ఆకుపచ్చ రంగులు.  అంగారక స్తోత్రాలు పఠించండి.

మిథునం....
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. బంధువులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నలుపు రంగులు. . దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం...
పట్టుదల, ధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్యసమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  అందరిలోఉద్యోగాలలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, తెలుపు రంగులు.  శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

సింహం..
కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పసుపు, నేరేడు రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

కన్య....
వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వివాహాది వేడుకల నిర్వహణకు సమాయత్తమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు మరింత లాభించి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతోకలహాలు.  ఎరుపు, నేరేడు రంగులు.  శివాష్టకం పఠించండి.

తుల.....
ప్రముఖులు పరిచయమవుతారు. ఆర్థిక విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వాహనయోగం. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. గులాబీ, నీలం రంగులు.  దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో  వృథా ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత పసుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు...
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. బంధువులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. అయినా ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు కొంత ఫలిస్తాయి. వారం ప్రారంభంలో  బంధువిరోధాలు. శ్రమాధిక్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. . సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం...
ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వివాహాది వేడుకలపై దృష్టి సారిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. దత్తాత్రేయుని ఆరాధించండి.

కుంభం...
ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. కుటుంబసభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. వాహన, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. . దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.

మీనం...
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. కొత్త రుణాలు కోసం యత్నాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. బంధువులు, మిత్రులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు. గృహం కొనుగోలు, నిర్మాణాలలో ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కక డీలాపడతారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శు¿¶ వార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ రంగులు.. ఆంజనేయ దండకం పఠించండి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)