Breaking News

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published on Sun, 03/23/2025 - 05:12

మేషం....
అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని సమస్యలు, వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపడరాదు.  స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. కళాకారుల యత్నాలు సఫలీకతమవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. వ్యయప్రయాసలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, దుర్గాదేవిని పూజించండి.

వృషభం...
శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. కొన్ని పనులు నేర్పుగా పూర్తి చేస్తారు. పట్టుదలతో సమస్యలు అధిగమిస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆరోగ్యం కుదుటపడి స్వస్థత చేకూరుతుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు రావచ్చు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పవు. కళాకారులకు యత్నకార్యసిద్ధి.. వారం ప్రారంభంలో చికాకులు. మానసిక అశాంతి. ఇంటాబయటా ఒత్తిడులు ఉండవచ్చు. గులాబీ, లేత నీలం రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం...
పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోగతి సాధిస్తారు.  ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు రావచ్చు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారి కలలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. బం«ధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిఒత్తిడులు, సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటారు.  వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు శ్రమ మరింత పెరుగుతుంది.. తెలుపు, గులాబీరంగులు, గణపతి అర్చన చేయండి.

సింహం...
కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు సంభవం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. నీలం, తెలుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.

కన్య....
మీ అభ్యర్థనను కుటుంబసభ్యులు మన్నిస్తారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు కూడా వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల ద్వారా కొంత సహాయసహకారాలు అందుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం, ఖర్చులు. ఎరుపు, లేత పసుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

తుల...
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులు, సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పాతసంఘటనలు గుర్తకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులు మీకు దగ్గరవుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు.  కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు,  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం..
అనుకున్న పనుల్లో అవాంతరాలు ఎదుర్కొంటారు. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాలలో కొంత నిరుత్సాహం. రుణదాతల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు ∙నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో ధనలాభం. కార్యసిద్ధి. శుభవర్తమానాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు,  దేవీఖడ్గమాల పఠించండి.

ధనుస్సు...
ఇంతకాలం పడిన శ్రమ కొంత మేరకు ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం.  వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది.  రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం...
నూతన పరిచయాలు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. విద్యావకాశాలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులతో ముఖ్య విషయాలపై చర్చలు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం  ప్రారంభంలో కొన్ని వివాదాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో కొన్ని ఇబ్బందులు. నీలం,తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం...
అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులకు అవకాశం.. కళాకారులకు  చేజారిన అవకాశాలు తిరిగి దక్కుతాయి. వారం చివరిలో మానసిక అశాంతి. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యం మందగిస్తుంది. పసుపు, నీలం రంగులు.. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం...
ఎంతటి పనైనా ఓపిగ్గా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా  గడుపుతారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)