Breaking News

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published on Sun, 06/22/2025 - 05:07

మేషం....
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలు సందçర్శిస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో  దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువిరోధాలు. లేత నీలం, గులాబీ రంగులు.విష్ణుధ్యానం చేయండి.

వృషభం....
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. వాహనాలు కొంటారు. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలితమిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. కళాకారులకు సన్మానాలు,ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

మిథునం...
సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవర్తమానాలు. రాబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. అనుకున్నది పట్టుదలతో  సాధిస్తారు. కార్యసిద్ధి. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారలావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో వృథా ఖర్చులు అధికం. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం....
పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధువులు ఆపద్బాంధువులుగా ఆదుకుంటారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి.  గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన పురోభివృద్ధి. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం...
పనులు నిదానంగా సాగుతాయి. స్నేహితులతో స్వల్ప వివాదాలు. కలహాలు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పాతసంఘటనలు గుర్తుకుతెచ్చుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూరపు బంధువులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కే ఛాన్స్‌. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కన్య..
రావలసిన డబ్బు అంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు.  వారం ప్రారంభంలో బంధువులతో కలహాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల..
అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  పనిభారం మరింత తగ్గుతుంది. కళాకారులకు అన్ని విధాలా అనుకూలం.  వారం మధ్యలో బంధువిరోధాలు. పనిఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. శివారాధన మంచిది.

వృశ్చికం...
రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహన, గృహయోగాలు.  . ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. దీక్షతో ముందుకు సాగి విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.  వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. లాభాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పసుపు,నేరేడు రంగులు.దేవీఖడ్గమాల పఠించండి.

ధనుస్సు...
అనుకున్న ఆదాయం లభించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి.  వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా సాగుతాయి.  రాజకీయవర్గాలకు ఊహించని పదవులు. వారం చివరిలో మిత్రులతో కలహాలు. అనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. ఎరుపు, గులాబీ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం...
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాలబాట పడతారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం.  రాజకీయవర్గాలకు కొన్ని విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం...
ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు.  ఇంట్లో శుభకార్యాల సందడి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధననష్టం. అనారోగ్య సూచనలు. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం...
ఆదాయం కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కాంట్రాక్టర్లకు కొంత నిరాశ ఎదురవుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. అనారోగ్య సూచనలు. దేవాలయ దర్శనాలు. నిరుద్యోగులకు కొంత గందరగోళం.   వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు. . రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి..

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)