Breaking News

ఈ రాశివారికి వారం మధ్యలో గుడ్‌న్యూస్‌.. ధన, వస్తులాభాలు

Published on Sun, 05/21/2023 - 07:18

మేషం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. పసుపు, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం: ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగించవచ్చు. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం: పనులలో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. నేరేడు, లేత ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమా«ధిక్యం. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు నిరుత్సాహం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. లేత పసుపు, గులాబీరంగులు,తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ, కళారంగాలవారికి విదేశీ పర్యటనలు. దైవదర్శనాలు. నేరేడు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కన్య: అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.

తుల: అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఎరుపు, బంగారురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

వృశ్చికం: దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు. తండ్రితరఫు వారి నుంచి ధన, వస్తులాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. తెలుపు, చాక్లెట్‌రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: పనులు సకాలంలో పూర్తయి ఊపిరిపీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీపడతారు. చర,స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. సన్మానయోగం. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మకరం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులు, నిరుద్యోగులు అసంతృప్తి చెందుతారు. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం, తెలుపు రంగులు,  ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి..

కుంభం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. నలుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం: ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. పోటీపరీçక్షల్లో అనుకూల ఫలితాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఎరుపు, బంగారు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)