ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Published on Sun, 07/19/2026 - 01:08

మేషం..
కొన్ని చికాకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని విషయాలలో మీ మాటకు ఎదురుండదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల నుంచి ఆహ్వనాలు అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఏæ పనైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన  మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలు, క్రీడాకారులకు పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ. గులాబీ, లేత పసుపు రంగులు.  అంగారక స్తోత్రాలు పఠించండి.

వృషభం....
ఆర్థికంగా పడిన ఇబ్బందులు తీరతాయి. సోదరులతో మనస్పర్థలు సర్దుకుంటాయి. ఆస్తుల విషయంలో ఒక ఒప్పందానికి వస్తారు. కీలక వ్యక్తుల సమావేశాలలో పాల్గొంటారు.  మిత్రులను  కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. విద్యార్థుల కృషి ఫలించే సమయం. స్వయం కృషితో కొన్ని పనులు చక్కదిద్దుతారు.. వ్యాపారాలు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తారు. కొత్త పెట్టుబడులకు అవకాశాలున్నాయి.. ఉద్యోగాలలో  బాధ్యతలు క్రమేపీ తగ్గుతాయి. కళాకారులు,  రాజకీయవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో లేనిపోని ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక అశాంతి. ఆకుపచ్చ, ఎరుప రంగులు.  దేవీస్తుతి మంచిది.

మిథునం...
మిమ్మల్ని ఆకట్టుకునే సంఘటనలు ఎదురుకావచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు  కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో క్రమేపీ పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులు ఊహించని ఉద్యోగాలు సాధిస్తారు. భూవివాదాల తీరి లబ్ది పొందుతారు. వ్యాపారాలను సజావుగా నడిపి లాభాల బాట ఎక్కిస్తారు.  ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. కళాకారులు, రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. మంచి గుర్తింపు సైతం దక్కుతుంది. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు, సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. గులాబీ, నేరేడు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం...
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. మరోవైపు అప్పుల కోసం యత్నాలు సాగిస్తారు.  శ్రమ తప్పకపోవచ్చు. అనుకున్న కార్యక్రమాలలో అవరోధాలు.. బంధువులు, మిత్రులు కొంత అలక వహించే వీలుంది.  ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురై ఇబ్బంది పెట్టవచ్చు. . సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొంత జఠిలం కావచ్చు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడొచ్చు.. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు పసుపు, ఎరుపు రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.

సింహం...
మీపై నిందలు మోపాలనుకున్న వారే పశ్చాత్తాపం చెందుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో మంచి పేరు గడిస్తారు. పాత  విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దూరమైన బంధువులు కూడా దగ్గరకు వస్తారు.. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. అలాగే, మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.. కళాకారులు, రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. . వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు.ఆకస్మిక ప్రయాణాలు.  పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. హనుమాన్‌ను పూజించండి.

కన్య....
ముఖ్యమైన  వ్యవహారాలు సమయానుసారం పూర్తి చేస్తారు.  బంధువుల చేయూతతో  ముందుకు సాగుతారు. శుభకార్యాలకు సన్నాహాలు చేసుకుంటారు.  జీవిత భాగస్వామితో తగాదాలు పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆనందాన్ని కుటుంబçసభ్యులతో పంచుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం. క్రీడాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. కష్టమే తప్ప ఫలితం ఉండదు. ఆకుపచ్చు, పసుపు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

తుల....
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా ముగిస్తారు. ఆప్తుల సూచనలు స్వీకరిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారవుతాయి. సోదరుల ఆహ్వానాలు రాగలవు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి æ మెరుగుపడుతుంది. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు.కళాకారులు,  రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు.  నీలం, నేరేడు రంగులు. నవగ్రహారాధన మంచిది.

వృశ్చికం...
ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు.  చిన్ననాటి మిత్రులు తారసపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొ ంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో  గౌరవం  పెరుగుతుంది.  ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఊహించని అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి, అనుకున్నంత లాభాలు రాగలవు.. ఉద్యోగాలలో చాకచక్యంగా వ్యవహరించి విధులు చక్కదిద్దుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ఆశలు నెరవేరతచాయి.  వారం చివరిలో అనారోగ్యం, బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దత్తస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
కొన్ని విషయాలలో నిక్కచ్చిగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంటారు. . ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాలు అంచనాల మేరకు కొనసాగుచతాయి. అప్పుల బాధలు తొలగుతాయి.  సంఘ సేవలో పాలుపంచుకుంటారు. కుటుంబసభ్యుల సలహాల మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంతో సాగుతారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మకరం...
పట్టుదలతో అనుకున్న పనులు చక్కదిద్దుతారు. జీవిత భాగస్వామి ద్వారా కొంత ఆస్తిలాభం ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ప్రయోజనం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో్ర వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు.  బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు.  కనక«ధారా స్తోత్రాలు పఠించండి.

కుంభం...
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. నిరుద్యోగులకు స్థిర ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. కళారంగం వారి సేవలకు గుర్తింపు రాగలదు. వారం మధ్యలో  సోదరులతో కలహాలు. అనారోగ్యం సూచనలు. దూరప్రయాణాలు. తెలుపు, నేరేడు రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

మీనం....
కొన్ని పనులు  విజయవంతంగా పూర్తి చేసి సమర్థత చాటుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తి వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత కలసివస్తాయి. కీలక  సమావేశాలలో పాల్గొంటారు. విద్య, వివాహయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత నీలం రంగులు. . గణేశ్‌ను పూజించండి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)