ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Published on Sun, 07/12/2026 - 03:12

మేషం...
పనులలో జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు  నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబసమస్యలు సవాలుగా మారతాయి. విద్యార్థులు మరింత శ్రమపడాలి. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో అవాంతరాలు.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. నీలం, పసుపు రంగులు.  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృషభం...
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు,  శివస్తోత్రాలు పఠించండి.

మిథునం...
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు. వాహన, గృహయోగాలు కలుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.  వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం.  వారం ప్రారంభంలో రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం...
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు.  రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. తెలుపు, లేత ఎరుపు రంగులు, గణేశ్‌ను పూజించండి.

సింహం....
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. మిత్రులతో కలహాలు. గులాబీ, పసుపు రంగులు, శ్రీరామస్తోత్రాలు  పఠించండి.

కన్య...
సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి విషయంలో ఊహించని ఒప్పందాలు. కొత్త వ్యక్తులు పరిచయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.  వ్యాపారాలను మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు.  కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, నలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

తుల...
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. గృహయోగాలు.  వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు. రాజకీయవర్గాలకు ఉత్సాహం.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం..
ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని వివాదాలకు సంబంధించి చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి సాధిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆశాజనకంగా ఉంటుంది.  వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఆరోగ్యభంగం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చేయండి.

ధనుస్సు...
సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాల చిరకాల కోరిక నెరవేరుతుంది.  వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఎరుపు, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.

మకరం...
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రుల సూచనలతో ముందుకు సాగుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు.  దేవీఖడ్గమాల పఠించండి.

కుంభం...
రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి..

మీనం...
అనుకున్న పనులు  విజయవంతంగా సాగుతాయి. సన్నిహితులు సహాయపడతారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఆలోచనలు ఆప్తులతో పంచుకుంటారు. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. వాహనయోగం.  ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం.  లేత ఎరుపు, బంగారు రంగులు.  లక్ష్మీస్తుతి మంచిది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)