Breaking News

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published on Sun, 06/08/2025 - 05:20

మేషం...
పనులు క్రమేపీ పుంజుకుంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. భూములు, వాహనాలు కొంటారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. శ్రమ పెరుగుతుంది. నీలం, ఆకుపచ్చ రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం...
వ్యవహారాలలో  విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో కుటుంబసమస్యలు. ఆరోగ్యభంగం. తెలుపు, నేరేడు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

మిథునం...
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
ఉత్సాహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో గతం నుంచి నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం....
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సవాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి.వారం మధ్యలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య...
ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు ముందుకు సాగవు.వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, లేత గులాబీ రంగులు. కనకధారాస్తోత్రం పఠించండి.

తుల...
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పరపతి పెరుగుతుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం...
ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసహకారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో కలహాలు. పసుపు, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.

ధనుస్సు....
కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఇంటిలో విందువినోదాలు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. దాపరికాలు లేకుండా మీ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తారు . చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి., ఉద్యోగాల్లో ప్రగతి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు.  కనకధారా స్తోత్రాలు పఠించండి.

మకరం....
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల కాలం. కొన్ని ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. కొత్త విషయాలు తెలుస్తాయి. మీఖ్యాతి మరింత పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. కళాకారులకు పురస్కారాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం...
పరపతి పెరుగుతుంది. సోదరులు,  సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల సహకరిస్తారు. వాహనయోగం. నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో  వివాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఎరుపు, లేత పసుపు రంగులు. దుర్గాదేవిని పూజించండి.

మీనం....
పరిచయాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆశ్చర్యకౖరమైన సమాచారం. మిత్రులతో వివాదాలు తీరతాయి. అంచనాలు నిజమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులకు  లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు అవార్డులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. సోదరులతో స్వల్ప వివాదాలు. పసుపు, ఎరుపు రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి. 

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)