ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Published on Sun, 07/05/2026 - 00:03

మేషం...
పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు నుంచి విముక్తి. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం...
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని లక్ష్యాలు నెరవేరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు నూతనోత్సాహం. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సమస్యలు తీరతాయి. వారం మధ్యలో  వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నీలం, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.

మిథునం...
పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, ఆకుపచ్చ రంగులు.  దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు కొత హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత అనుకూల సమయం. వారం  ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

సింహం....
ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. మీ మాటే చెల్లుబాటు కాగలదు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. వాహనయోగం. మీ నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య...
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతస్థితి రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. గులాబీ, ఎరుపు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

తుల....
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. మానసిక ఆందోళన. నేరేడు, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహన, గృహయోగాలు.  ప్రత్యర్థులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. దీక్షతో ముందుకు సాగి విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.  వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. లాభాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పసుపు, తెలుపు రంగులు.  దేవీఖడ్గమాల పఠించండి.

ధనుస్సు...
అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  పనిభారం మరింత తగ్గుతుంది. కళాకారులకు అన్ని విధాలా అనుకూలం.  వారం మధ్యలో బంధువిరోధాలు. పనిఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. శివారాధన మంచిది.

మకరం...
అవసరాలకు డబ్బు అందక ఇబ్బందులు ఎదురైనా అధిగిస్తారు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు. ఆత్మీయులతో విభేదాలు నెలకొనవచ్చు. కాంట్రాక్టర్లు నిరాశ చెందుతారు.  సన్నిహితులు వ్యవహారాలలో ఒత్తిడులు పెంచుతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. విద్యార్థులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు దక్కక నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. నీలం, గులాబీ రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కుంభం...
అనుకున్న ఆదాయం లభించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం. అందరిలోనూ మీ ప్రత్యేకత చాటుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి.  వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా సాగుతాయి.  రాజకీయవర్గాలకు ఊహించని పదవులు. వారం చివరిలో మిత్రులతో కలహాలు. అనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. ఎరుపు, గులాబీ రంగులు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం....
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. ఎరుపు, నేరేడు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)