Breaking News

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Published on Sun, 09/15/2024 - 04:58

మేషం..
కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వాహనసౌఖ్యం. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విశేష గౌరవం లభిస్తుంది. వారం చివరిలో బంధువిరోధాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం..
కొత్త పనులు చేపడతారు. ఆలోచనల అమలుకు చర్యలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. గులాబీ, నీలం రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.

మిథునం..
నూతనంగా చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో రాజీపడరు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో అనారోగ్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం..
ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు తీరతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో బంధువిరో«ధాలు. గులాబీ, తెలుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి.

సింహం..
శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

కన్య..
ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారి సేవలు గుర్తింపు పొందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.

తుల..
చేపట్టిన వ్యవహారాలు కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడినా అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. పారిశ్రామికవర్గాల యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తుతి మంచిది.

వృశ్చికం..
మీ అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పవచ్చు. ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు..
ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. అనారోగ్య సూచనలు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. విద్యార్థులకు చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో ఆకస్మిక ధన, వస్తులాభాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గామాతకు అర్చన చేయండి.

మకరం..
పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. గులాబీ, లేత పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం..
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

మీనం..
ముఖ్యమైన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాల కొనుగోలు. సోదరుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం చివరిలో అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)