Breaking News

Weekly Horoscope: కొత్త పనులకు శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేస్తారు

Published on Sun, 07/14/2024 - 06:43

మేషం
కొత్త పనులకు శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆశించిన రాబడి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషదాయకంగా గడుస్తుంది. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. నలుపు, లేత గులాబీ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృషభం
ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే ఆశాజనకంగా ఉంటాయి. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఊహించని కొన్ని  సంఘటనలు ఎదురై ఆకట్టుకుంటాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. మీ అభిప్రాయాలను మిత్రులతో పంచుకుని సలహాలు స్వీకరిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా గడుస్తుంది.  రాజకీయవర్గాలకు కొన్ని  పదవులు దగ్గరకు వస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు, గణేశాష్టకం పఠించండి.

మిథునం
ఆర్థికంగా మరింత బలపడతారు. రుణగ్రస్తుల బాధలు తొలగుతాయి. మీ మాట నెగ్గించుకునేందుకు మరింత శ్రమిస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో సానుకూల వాతావరణం. పారిశ్రామికవర్గాల యత్నాలు మరింత వేగవంతంగా కాగలవు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, బంగారు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం
ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి  మొత్తానికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. చిరకాల శత్రువులు కూడా మిత్రులుగా అనుకూలంగా మారతారు. పరిచయాలు పెరుగుతాయి.  తీర్థయాత్రలు చేస్తారు. వాక్చాతుర్యం మీకు వరంగా మారనుంది. వ్యాపార లావాదేవీలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో స్వల్ప వివాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు. ఎరుపు, గులాబీ రంగులు, శివాష్టకం పఠించండి.

సింహం
పనులలో ప్రతిబంధకాలు రావచ్చు. ఆలోచనలు నిలకడగా సాగక ఎటూ పాలుపోదు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల సలహాల కోసం యత్నిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై  శ్రద్ధ చూపండి. వ్యాపారాలు అతి సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధులు గందరగోళంగా ఉండవచ్చు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు, దుర్గాదేవిని స్మరించండి.

కన్య
ఆర్థిక లావాదేవీలను క్రమపద్ధతిలో నిర్వహిస్తూ అప్పులు లేకుండా గడిపేస్తారు. కొన్ని  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలను వేగవంతంగా చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పట్టుదలతో నిర్వహించి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ముఖ్య సమాచారం రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల
వ్యవహారాలను పూర్తి చేయడంలో సఫలమవుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో మనస్పర్థలకు స్వస్తి చెబుతారు. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధులు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, తెలుపు రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
ఎంతటి వారినైనా ఆకట్టుకునేలా మాట్లాడతారు.  ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకున్న వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. వాహనయోగం. కుటుంబంలో వేడుకల కోసం సన్నాహాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఇంటాబయటా చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు,  శ్రీరామస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖులతో సమావేశమవుతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులు నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వస్తాయి.. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు రావచ్చు.  రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు,  దేవీస్తోత్రాలు పఠించండి.

మకరం
ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం
కొన్ని ఇబ్బందులను అధిగమించి కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగి సమస్యలను అధిగమిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. ఎరుపు, నేరేడు రంగులు,  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం
సంఘంలో పరపతి పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. గతంలో మీకు దూరమైన కొందరు ఆప్తులు తిరిగి దగ్గరవుతారు.. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో మరింత దూసుకువెళతారు. ఉద్యోగులకు కీలక సందేశం. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం మధ్యలో అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)