Breaking News

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Published on Sun, 08/11/2024 - 05:26

మేషం..
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు.  సంఘంలో  విశేష గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వాహనసౌఖ్యం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక,రాజకీయరంగాల వారికి పట్టింది బంగారమే. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం..
అనుకున్న పనులు కాస్త నెమ్మదిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం చివరిలో  ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, పసుపు రంగులు.ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం..
బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు.ఆదిత్య హృదయం పఠించంyì

కర్కాటకం..
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు.  విష్ణుధ్యానం చేయండి.

సింహం..
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. సోదరుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కన్య..
పనుల్లో జాప్యం. నిర్ణయాలు కొన్ని మార్పుచుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.  బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి, ఆశించిన పెట్టుబడులలో అవాంతరాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళాకారులకు చికాకులు. వారం మధ్యలో శుభవార్తలు, వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. గులాబీ, పసుపు రంగులు.  శివాష్టకం పఠించండి.

తుల..
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత చికాకులు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు.  శివాష్టకం పఠించండి.

వృశ్చికం..
ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఆనుకోని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు..
పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు కొంత కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం..
ముఖ్యమైన పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. సన్నిహితులతో మాటపట్టింపులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు.  

కుంభం..
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. భూములు, వాహనాలు కొంటారు. అనుకోని ఇంటర్వ్యూలు అందుతాయి. మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు అధిగమిస్తారు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం..
కొన్ని ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఎటువంటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు కొనుగోలు యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)