Breaking News

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published on Sun, 11/10/2024 - 06:03

మేషం
నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని సమస్యలు పరిష్కారంలో చొరవ చూపుతారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు.  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో  లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త ప్రయత్నాలు సఫలం. వారం చివరిలో ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

వృషభం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులలో  పురోగతి కనిపిస్తుంది. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.  వివాహయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని వేడుకల్లో  పాల్గొంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. కళారంగం వారికి అంచనాలు నిజమవుతాయి. వారం  చివరిలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మిథునం
బంధువుల నుంచి కీలక విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన పనుల్లో  విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో  లాభాలు ఆర్జిస్తారు.  ఉద్యోగాలలో ప్రశంసలు అందుతాయి. కళారంగహం వారికి  ఆహ్వానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం
ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. రావలసిన సొమ్ము కూడా అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారంలో చొరవ చూపుతారు. పోటీపరీక్షల్లో  నిరుద్యోగులకు విజయం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. దైవదర్శనాలు చేస్తారు.  వ్యాపారాలలో  భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో విధుల్లో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి గందరగోళం తొలగుతుంది. వారం ప్రారంభంలో  మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

సింహం
పట్టుదలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల సలహాలు, సహాయం అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో  బంధువిరోధాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

కన్య
కొన్ని సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సలహాలు స్వీకరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్య నిర్ణయంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.  ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో  బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల
వ్యూహాత్మకంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.  వాహనయోగం. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో అనుకోని ధనవ్యయం.  కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం
కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం దక్కుతుంది.  స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. కళారంగం  వారికి మరింత ఉత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూముల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త  పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు.  పారిశ్రామికవర్గాలకు విశేషంగా రాణిస్తుంది. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం.  బంధువులతో వివాదాలు.   సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం
అనుకున్న పనుల్లో  ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అధిగమిస్తారు. శ్రమ మరింత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.  ఆలోచనలు నిలకడగా ఉండవు. నిరుద్యోగులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యభంగం. బంధువర్గం నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలలో  లాభాలు స్వల్పంగా అందుతాయి. ఉద్యోగాలలో  పనిఒత్తిడులు. రాజకీయవర్గాలకు నిరాసక్తత. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, నేరేడు రంగులు.  శివాష్టకం పఠించండి.

కుంభం
కొన్ని పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. గృహం, వాహనాలు   కొనుగోలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.  వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. వారం చివరిలో స్వల్ప వివాదాలు. శారీరక రుగ్మతలు.ఆదిత్య హృదయం పఠించండి.

మీనం
ఆర్థికంగా మరింత బలపడతారు.  బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త  పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. ధనవ్యయం.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)