Breaking News

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!

Published on Sun, 08/04/2024 - 06:47

మేషం
అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకుల నుండి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో మనస్పర్థలు తొలగి సత్సంబంధాలు నెలకొంటాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశించినమేర లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది, వీరి సేవలకు తగిన గుర్తింపు రాగలదు.  రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు.  తెలుపు, ఎరుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవార్తా శ్రవణం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. భూసంబంధిత వివాదాల పరిష్కారం. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థుల తెలివితేటలకు సరైన అవకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలు వేగవంతంగా చేస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి వారి నుండి పిలుపు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. వారం మధ్యలో మానసిక సంఘర్షణ. ఆప్తులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.

మిథునం
ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉండి అప్పులు చేస్తారు. బంధువులు,స్నేహితులతో అకారణంగా తగాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురై సవాలుగా నిలుస్తాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో కొన్ని అవాంతరాలు రావచ్చు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు.  వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి, లాభాలు అత్యంత స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళారంగం వారికి చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. వాహనయోగం. విందువినోదాలు. నేరేడు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం
ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపుతో పాటు మన్ననలు అందుకుంటారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. శుభకార్యాలలోనూ పాలుపంచుకుంటారు.  సోదరుల నుంచి శుభవర్తమానాలు. నిరుద్యోగులు పడిన శ్రమ ఫలించే సమయం. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కవచ్చు. రాజకీయవేత్తలకు సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు,  అంగారకస్తోత్రం పఠించండి.

సింహం
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం మీ అంచనాల మేరకు లభిస్తుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.  కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. కుటుంబంలో పరిస్థితులు చక్కబడి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వస్తులాభాలు.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు ఉన్నత పదవులు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యం సహకరించదు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు, గణేశాష్టకం పఠించండి.

కన్య
నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యసమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులు బాధ్యతలను అంకితభావంతో పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకోని అవకాశాలు. వారం చివరిలో వృధా ఖర్చులు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. చాక్లెట్, ఎరుపు రంగులు,శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

తుల
అతి ముఖ్యమైన ∙కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆదాయం ఖర్చులకు సరిపడ లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలు ప్రస్తుతం వాయిదా వేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు.  వ్యాపారాలలో లాభాలు తథ్యం.  ఉద్యోగులకు ఉన్నత స్థాయి పోస్టులు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు శక్తియుక్తులతో సంస్థలను నడిపిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బం«ధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి.

వృశ్చికం
అదనపు రాబడితో హుషారుగా గడుపుతారు. ఇంటాబయటా సంతోషదాయకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. అందరూ ఆశ్చర్యపడేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ విశేష గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా సాగి లాభాల బాట పడతారు. ఉద్యోగులకు ఒక ముఖ్య సందేశం ఊరటనిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీయానం. వారం చివరిలో కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు, విష్ణుధ్యానం చేయండి.

ధనుస్సు
విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. అతి ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటురాదు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు సన్మానయోగం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. శ్రమాధిక్యం. నీలం, లేత పసుపు రంగులు, దుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మరుగున పడిన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారమై ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలు విస్తరించడంలో సఫలం చెందుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలపై పట్టు లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధననష్టం. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. పసుపు, గులాబీరంగులు,వినాయకుని పూజించండి.

కుంభం
ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడి కొంత నిల్వ చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు పొందుతూ ముందడుగు వేస్తారు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది.  బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం క్రమేపీ మెరుగవుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో రెండడుగులు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం నుండి విముక్తి.  రాజకీయవర్గాలకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం చివరిలో శ్రమ పెరుగుతుంది. ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు,నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు మరింత సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన రీతిలో నిర్ణయాలు ఉంటాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు.  వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఇబ్బందులు రావచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు,  కనకధారాస్తోత్రం పఠించండి.
 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)